Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: కరోనా ప్రభావం.. ఐపీఎల్‌కు ఆసీస్‌ ప్లేయర్లు దూరం?

Cricket Australia likely to review IPL 2020 contracts in wake of Coronavirus outbreak

ముంబై: చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా (కొవిడ్‌ 19) వైరస్‌ భారత దేశంలోనూ పంజా విసురుతోంది. వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు, ప్రజల సంక్షేమం దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 29న ప్రారంభం కావ్సాలిన 13వ సీజన్‌ ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడింది.

ఐపీఎల్‌కు దూరం?:

ఐపీఎల్‌కు దూరం?:

ఐపీఎల్‌-13 సీజన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్‌ రాబర్డ్స్‌ మాట్లాడుతూ... 'మేం ఆటగాళ్లకి సలహాలు మాత్రమే ఇవ్వగలం. అంతిమ నిర్ణయం ఆటగాళ్లదే. అయితే ఆటగాళ్లు ఐపీఎల్‌లో వ్యక్తిగత ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బీసీసీఐ, ఐపీఎల్‌ డివిజన్‌ కూడా ఒక దృక్పథం ఉంటుంది. బీసీసీఐతో మా ఆటగాళ్లు సంప్రదించి పరిస్థితులకు తగ్గట్లుగా ఓ నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు.

ఒప్పందాలు రద్దు:

ఒప్పందాలు రద్దు:

ఐపీఎల్‌లో వివిధ ప్రాంఛైజీలతో 17 మంది ఆసీస్‌ ప్లేయర్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పాట్ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌ తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటారని ఆసీస్ మీడియా పేర్కొంది. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కంగారూలపై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పాట్ కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకోగా.. మాక్స్‌వెల్‌ను రూ.10.75 కోట్లకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ దక్కించుకుంది. ఐపీఎల్‌తో పాటు 'ది హండ్రెడ్' సిరీస్‌కు కూడా ఆసీస్‌ ప్లేయర్లు దూరమవుతారని సమాచారం.

 స్టార్క్‌కు ఎదురుదెబ్బ‌:

స్టార్క్‌కు ఎదురుదెబ్బ‌:

ఆస్ట్రేలియా మరో స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్‌కు గట్టి ఎదురుదెబ్బ‌ తగలనుంది. ఐపీఎల్ 2018 సీజన్‌లో తనకు రావాల్సిన రూ.9.6 కోట్ల పారితోషకాన్ని ఈ స్టార్ పేసర్ కోల్పోనున్నాడు. 2018 సీజన్‌లో గాయం కార‌ణంగా స్టార్క్ ఆడ‌లేదు. ఆ ఏడాది అత‌న్ని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ ముగిసిన తర్వాతా స్టార్క్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఉండ‌టంతో గత సీజన్ ఐపీఎల్‌‌లో స్టార్క్ ఆడ‌లేదు. ఉద్దేశ పూర్వకంగా స్టార్క్ ఐపీఎల్‌కు దూర‌మ‌య్యాడ‌ని, అత‌నికి అయిన గాయం ఆకస్మాత్తుగా కాలేద‌ని కోర్టులో తేలింది. దీంతో తన పారితోషకాన్ని కోల్పోనున్నాడు.

Story first published: Wednesday, March 18, 2020, 9:12 [IST]
Other articles published on Mar 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+