Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీ ఓపెరా హౌస్‌పై యాషెస్ వెలుగు జిలుగులు (వీడియో)

Cricket Australia lights up Sydney Opera House to celebrate Ashes win

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా 4-0తో జేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. యాషెస్ సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 123 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

2017-18 సమ్మర్ సీజన్ ఆస్ట్రేలియాకు ఎంతో కలిసొచ్చింది. స్మిత్ నేతృత్వంలోని పురుషుల జట్టు 4-0తో యాషెస్‌ను కైవసం చేసుకోగా... ఆసీస్ మహిళల జట్టు కూడా యాషెస్‌ను చేజిక్కించుకుంది. దీంతో యాషెస్ విజయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్నంగా సంబరాలు చేసింది.

సిడ్నీలోని ఓపెరా హౌస్‌పై గ్రీన్, గోల్డ్ రంగులతో యాషెస్ వెలుగు జిలుగులతో నింపింది. పురుషుల యాషెస్ ట్రోఫీతో పాటు మహిళల ట్రోఫీని రంగుల మధ్యలో ప్రదర్శించింది. 2017-18 యాషెస్ సిరిస్‌ను మొత్తం 866, 732 మంది వీక్షించారు. 1936-37 తర్వాత అత్యధిక మంది వీక్షించిన రెండో యాషెస్ (948,498) సిరిస్ ఇదే కావడం విశేషం.

ఈ సందర్భంగా యాషెస్ సిరిస్ గెలిచిన ఇరు జట్లకు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఏ జేమ్స్ సందర్లాండ్ శుభాకాంక్షాలు తెలిపాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టును స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో డామినేట్ చేసింది.

ముఖ్యంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలనందించాడు. ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ మొత్తం 137 సగటుతో 687 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ సిరిస్‌లో ప్యాట్ కుమ్మిన్స్ 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

గాయం కారణంగా మెల్ బోర్న్ టెస్టుకు దూరమైన పేసర్ మిచెల్ స్టార్క్ 22 వికెట్లతో రెండో స్ధానంలో నిలిచాడు. టెస్టు సిరిస్ అనంతరం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 12:33 [IST]
Other articles published on Jan 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+