కఠిన నిబంధనలు: ఐపీఎల్ 2019కి ఆసీస్ క్రికెటర్లు దూరమేనా?


హైదరాబాద్: వచ్చే ఏడాది రెండు మేజర్ టోర్నీలు అయిన ఐసీసీ వరల్డ్ కప్ 2019, ఐపీఎల్ 2019... వారం గ్యాప్‌లో ఒకదాని తర్వాత మరొకటి ప్రారంభం కానున్నాయి. వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్ 2019 సీజన్‌లో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనే విషయమై డైలమా నెలకొని ఉంది.
ముఖ్యంగా వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దాదాపు అందుబాటులో లేనట్లే కనిపిస్తోంది. ఐపీఎల్, వరల్డ్ కప్‌ల మధ్య చాలా తక్కువ విరామం ఉండటంతో ఐపీఎల్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.

ఐపీఎల్ కంటే దేశానికే తొలి ప్రాధాన్యం
ఇందులో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ కంటే దేశానికే తొలి ప్రాధాన్యమివ్వాలని సీఏ అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 29న ఆరంభమై మే 19న ముగియనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.

వరల్డ్ కప్‌కు సన్నద్ధం కావడం కష్టం
దీంతో ఇంత తక్కువ సమయంలో వరల్డ్ కప్‌కు సన్నద్ధం కావడం కష్టం. వన్డే వరల్డ్ కప్‌కు ఎంపికైన 15మంది ఆసీస్ క్రికెటర్లు ఆ సమయంలో ఐపీఎల్‌లో ఆడుతుంటే అప్పటికప్పుడే టోర్నీనుంచి వైదొలిగి స్వదేశానికి పయనం కావాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఐపీఎల్‌లో ఆడాలనుకునే ఆసీస్ క్రికెటర్లు ముందుగా సీఏ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది.

దేశవాళీ టోర్నీలో తమ బాధ్యతలను
వరల్డ్‌కప్ నేపథ్యంలో స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలో తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించిన తర్వాతే ఐపీఎల్‌కు ప్రాధాన్యమివ్వాలని ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చిలో 15 నుంచి 29 వరకు ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే సిరిస్ జరిగే అవకాశం ఉందని బోర్డు వెల్లడించింది.

నవంబర్ 21 నుంచి భారత్-ఆసీస్ మధ్య మూడు టీ20ల సిరిస్
ఈ సిరిస్ ముగిసిన తర్వాతే ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఐపీఎల్‌కు అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌తో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications