
2023 వన్డే ప్రపంచకప్ ఉండడంతో..
2018లో న్యూలాండ్స్ బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో డేవిడ్ వార్నర్ ప్రధాన పాత్ర పోషించినట్లు నిర్ధారణ కావడంతో అతన్ని ఒక సంవత్సరం పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. అలాగే ఇక తన కెరీర్లో ఎప్పటికీ కెప్టెన్సీ చేపట్టకూడదనే నిర్ణయంతో వార్నర్‌పై లైఫ్ టైం బ్యాన్ కూడా విధించింది. ఇకపోతే ఇటీవలే ఆరోన్ ఫించ్ వన్డేలకు గుడ్ బై చెప్పడంతో సరైన లీడర్ కోసం చూస్తున్న ఆసీస్ మేనేజ్ మెంట్ వార్నర్‌ను తదుపరి వన్డే కెప్టెన్ చేసేందుకే ఈ బ్యాన్ ఎత్తివేయాలని చూస్తోంది. 2023లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. ఇక వార్నర్ మీద విధించిన బ్యాన్ ఎత్తివేయాలని ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల నుండి అనేక సూచనలు, వినతులు రావడంతో ఎట్టకేలకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయమై ముందుకెళ్తోంది.

రేపు బోర్డు మీటింగ్లో ఫస్ట్ స్టెప్
'క్రికెట్ ఆస్ట్రేలియాలోని పెద్దల అభిప్రాయం ఏమిటంటే.. డేవిడ్ గ్రౌండ్లో చాలా బాగా రాణిస్తున్నాడు. మంచి సహకారం అందిస్తున్నాడు' అని బోర్డ్ చైర్‌పర్సన్ లాచ్లాన్ హెండర్సన్ గురువారం యానువల్ జనరల్ మీటింగ్ అనంతరం విలేకరులతో అన్నాడు. అలాగే నిషేధం ఎత్తివేతకు ముందు మొదటి దశలో కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా సమీక్షించాల్సి ఉంటుంది. అలాగే అందులోని ఆంక్షలను కాస్త సవరించాలా లేదా కొత్తగా యాడ్ చేయాలా అనేది చూడాలి. వాటన్నింటి బట్టి వార్నర్ బ్యాన్ విషయంలో పూర్తి నిషేధం ఎత్తివేతకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే మొదటి స్టెప్ మాత్రం రేపు జరిగే బోర్డు మీటింగ్లో తీసుకోనున్నాం' అని హెండర్సన్ అలాగే బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ హింటిచ్చారు.

వీలయినంత త్వరగా నిషేధం ఎత్తివేత
ఆటగాడి సత్ప్రవర్తన, అభివృద్ధి కోసం సమీక్షించాల్సిన అన్ని ఆంక్షలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు హాక్లీ విలేకరులతో తెలిపాడు. అవసరమైనంత త్వరగా ఈ ప్రాసెస్ పూర్తి చేస్తామని హెండర్సన్ తెలిపారు. ఆలస్యం చేయడం వల్ల మేలు జరిగే అవకాశమే లేదని కూడా కూడా పేర్కొన్నాడు. ఈ ప్రాసెస్ ముగిశాక డేవిడ్‌కు సంబంధించి భవిష్యత్తులో ఏదైనా కెప్టెన్సీ విషయంలో డిస్కస్ చేస్తామని హక్లీ తెలిపాడు. వార్నర్ మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్‌గా పనిచేశాడు. వార్నర్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా పనిచేయడానికి సుముఖంగా ఉన్నానని, ఆ విషయాన్ని తానెంతో 'ప్రత్యేకం'గా పరిగణిస్తానని కూడా ఆ మధ్య

తగ్గిన క్రికెట్ ఆస్ట్రేలియా రెవెన్యూ
ఇకపోతే యానువల్ జనరల్ మీటింగ్లో క్రికెట్ ఆస్ట్రేలియా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 5.1మిలియన్ ఆస్ట్రేలియ డాలర్లు ($3.20మిలియన్ల అమెరికా డాలర్లు) నికర నష్టాన్ని ప్రకటించింది. అంటే మన కరెన్సీలో రూ.26కోట్లకు పై మాటే. అంతర్జాతీయ క్రీడా మీడియా హక్కుల మార్కెట్‌లో తిరోగమనం కారణంగా ఆదాయంలో 3.5% తగ్గుదల ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇక బిగ్ బాష్ లీగ్‌కు ఆదరణ తేవాలనే ఉద్దేశంత వార్నర్‌కు అలాగే స్టాయినిస్, మాక్స్ వెల్ లాంటి ప్లేయర్లకు ప్రత్యేక ప్యాకేజీలను కూడా ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












