
టీ20 వరల్డ్ కప్ 2022కు భారీగా స్పందన వస్తోంది. క్రికెట్ ఎక్కువగా ఇష్టపడే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుండడంతో మ్యాచ్ లు చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీ పడుతున్నారు. ట్వంటీ 20 ప్రపంచ కప్ సంబంధించి ఇప్పటికే 600,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం తెలిపింది. అక్టోబర్ 22 నుంచి మెయిన్ మ్యాచులు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా న్యూజిలాండ్
ఈ నెల 16న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. మెదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో శ్రీలంక్, నబేబియా, యూఏఈ, వెస్టిండీస్, నెదర్లాండ్, స్కాట్లండ్, జింబాబ్బే, ఐర్లాండ్ పాల్గొంటాయి. టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆస్ట్రేలియాలోని
ఏడు నగరాల్లో నిర్వహిస్తున్నారు. 22న సూపర్ 12 మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది.
90,000 వేలకు పైగా టికెట్లు
23న దాయాది జట్లైన భారత్ పాక్ తలపడనున్నాయి. మెల్ బోర్న్ వేదిక ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ సంబంధించి ఇప్పటికే 90,000 వేలకు పైగా టికెట్లు అమ్మినట్లు అధికారులు తెలిపారు. గీలాంగ్‌లోని 36,000 కెపాసిటీ గల కార్డినియా పార్క్ స్టేడియంలో శ్రీలంక నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి తక్కువ సంఖ్యలో టిక్కెట్లు మాత్రమే మిగిలి పేర్కొన్నారు.