For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ కాకపోతే శ్రీలంక: డే/నైట్‌ టెస్టు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త పలుకు

By Nageshwara Rao
Cricket Australia confirm Adelaide Test will be a day affair

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డే/నైట్‌ టెస్టు ఆడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డే/నైట్‌ టెస్టు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఈ-మెయిల్‌ ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ సదర్లాండ్‌కు రాశారు.

డే/నైట్‌ టెస్టు ఆలోచనను విరమించుకున్న సీఏ

డే/నైట్‌ టెస్టు ఆలోచనను విరమించుకున్న సీఏ

దీంతో అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే/నైట్‌ టెస్టుగా నిర్వహించాలనుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా తన ఆలోచనను విరమించుకుంది. తాజాగా 'అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 6 నుంచి 10వ తేదీల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయ్యే టెస్టు షెడ్యూల్‌ ప్రకారం పగటి పూటే జరుగుతుందని' క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు.

భారత పర్యటన ముగిసిన తర్వాత శ్రీలంక

భారత పర్యటన ముగిసిన తర్వాత శ్రీలంక

అయితే టీమిండియా పర్యటన ముగిసిన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో శ్రీలంకతో బ్రిస్బేన్‌ వేదికగా జరిగే టెస్ట్‌ను డే/టెస్ట్‌గా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సదర్లాండ్‌ తెలిపాడు. 'టెస్ట్‌ క్రికెట్ ప్రభావం కోల్పోకుండా స్వదేశీ గడ్డపై వేసవిలో ఆసీస్‌ ఆడే టెస్ట్‌ సిరీస్‌లో కనీసం ఒక్క టెస్ట్‌ అయినా డే/టెస్ట్‌ ఆడించాలని నిర్ణయించాం' అని ఆయన తెలిపాడు.

పర్యాటక జట్లతో డే/నైట్‌ టెస్టు మ్యాచ్

పర్యాటక జట్లతో డే/నైట్‌ టెస్టు మ్యాచ్

గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పర్యాటక జట్లు తప్పనిసరిగా కనీసం ఒక్క డే/నైట్‌ టెస్టు మ్యాచ్ అయినా ఆడుతున్నాయి. దీనికి కొనసాగింపుగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను కూడా అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే/నైట్ టెస్టు మ్యాచ్‌ను ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది.

2015లో అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్

2015లో అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్

అయితే డే/నైట్‌ టెస్టు ఆడేందుకు కనీసం 12 నుంచి 18 నెలల పాటు ప్రాక్టీస్ అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ పరిపాలనా కమిటీ(సీఓఏ)కు చెప్పడంతో ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు ఆలోచనను బీసీసీఐ విరమించుకుంది. 2015 నుంచి ఆస్ట్రేలియా ఇప్పటివరకు 4 డే/నైట్‌ టెస్ట్‌లు ఆడింది. ఈ 4 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. మొట్టమొదటిసారి 2015లో అడిలైడ్ వేదికగా న్యూజిలాండ్ తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌ని నిర్వహించింది.

Story first published: Tuesday, May 8, 2018, 14:33 [IST]
Other articles published on May 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+