For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలీ 'ఒసామా' ఆరోపణలపై విచారణ: క్రికెట్ ఆస్ట్రేలియా స్పందన ఇదీ

Asia Cup 2018: Afghanistan Wicket-Keeper Mohammad Shahzad Reports Spot-Fixing Approach
Cricket Australia Closes Probe Into Moeen Alis Osama Claim

హైదరాబాద్: తనని ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఒకరు ఒసామా' అని సంబోధిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఆరోపించిన సంగతి తెలిసిందే. స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా దిట్ట. మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీసి వార్తల్లో నిలిచిన సందర్భాలు అనేకం.

ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంటారు. ది టైమ్స్‌ ప్రసారం చేస్తున్న మొయిన్‌ అలీ ఆటో బయోగ్రఫీ సందర్భంగా మొయిన్‌ అలీ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే, ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు కూడా ఆదేశించింది.

ఆధారాలు లభించలేదు

ఆధారాలు లభించలేదు

అయితే, తమ విచారణలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇంతటితో ఈ విచారణను ఆపేస్తున్నామని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2015 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా' అని సంబోధించాడని అలీ తన ఆత్మకథలో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే.

అది నా తొలి యాషెస్‌ టెస్టు

అది నా తొలి యాషెస్‌ టెస్టు

"అది నా తొలి యాషెస్‌ టెస్టు. నా ప్రతిభ బయటపెట్టేందుకు ఉపయోగపడేది. కానీ, అక్కడ జరిగిన ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు నన్ను ‘ఒసామా‌' అంటూ పిలిచేవాడు. అయితే మైదానంలో నేనెప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు" అని అలీ తెలిపాడు.

ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పా

ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పా

"ఆ ఆటగాడు చేసిన వ్యాఖ్యల గురించి ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పా. ఇంగ్లాండ్ కోచ్ ట్రేవర్ బేలిస్ ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్‌ డారెన్‌ లీమన్‌తో సైతం ప్రస్తావించాడు. అప్పుడు కోచ్‌ డారెన్‌ ఆ ఆటగాడిని పిలిచి ‘మొయిన్‌ అలీని ఒసామా' అని పిలిచావా? అని ప్రశ్నించాడు. కానీ, ఆ ఆటగాడు ‘నేను అలా పిలవలేదు. కేవలం ‘పార్ట్‌టైమర్‌' అని మాత్రమే అన్నా' అంటూ అబద్ధం చెప్పాడు" అని అలీ పేర్కొన్నాడు.

 తాను సరిగానే విన్నానని ఆసీస్ కోచ్‌తో

తాను సరిగానే విన్నానని ఆసీస్ కోచ్‌తో

దీంతో ఆ మ్యాచ్ మొత్తంలో తాను కోపంగానే ఉండాల్సి వచ్చిందని అన్నాడు. దీంతో ‘ఒసామా', ‘పార్ట్‌ టైమర్‌' అన్న పదాలకు తనకు తేడా తెలుసని, మరీ అంత పిచ్చివాడిని కాదని అలీ అప్పట్లో తాను చెప్పినట్లు వెల్లడించాడు. అంతేకాదు తాను సరిగానే విన్నానని ఆసీస్ కోచ్‌తో తెలిపాడు. తాజాగా దీనిపై విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు.

 విచారణ చేపట్టిన జట్టు మేనేజ్‌మెంట్‌

విచారణ చేపట్టిన జట్టు మేనేజ్‌మెంట్‌

"ఈ ఘటన సమయంలోనే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు సూచనల మేరకు మా జట్టు మేనేజ్‌మెంట్‌ విచారణ చేపట్టింది. అప్పుడే మొయిన్‌ అలీకి తమ స్పందనను కూడా తెలియజేయడం జరిగింది. అతడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నాం" అని సీఏ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Story first published: Tuesday, September 25, 2018, 13:20 [IST]
Other articles published on Sep 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+