Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఎంతపని చేసింది!: ఏడాదిపాటు నిషేధానికి గురైన స్మిత్

Cricket Australia bans Emily Smith for sharing Playing XI on Instagram

హైదరాబాద్: హోబర్ట్ హరికేన్స్ యువ మహిళా వికెట్ కీపర్ ఎమిలీ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా 12 నెలల పాటు నిషేధం విధించింది. 24 ఏళ్ల ఎమిలీ స్మిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా హోబర్ట్ హరికేన్స్ జట్టుకు సంబందించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది.

నవంబర్ 2న సిడ్నీ థండర్స్‌, హోబర్ట్ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభమయ్యే గంట ముందు హోబర్ట్ హరికేన్స్ స్క్వాడ్ లైనప్‌ను ఎమిలీ స్మిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించిన కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్టికల్ 2.3.2 ప్రకారం స్మిత్‌పై 12 నెలల నిషేధం విధించింది. ఈ పోస్ట్ బెట్టింగ్‌కు సంబంధించి ఉపయోగించబడే సమాచారానికి దారితీస్తుందని, జట్టు రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నేరం అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

స్మిత్‌పై తొమ్మిది నెలలు పూర్తి సస్పెన్షన్ కొనసాగనుండగా.. ఒక సంవత్సరం పాటు ఎలాంటి క్రికెట్‌లో పాల్గొనకూడదు. సస్పెన్షన్ కారణంగా ఎమిలీ స్మిత్‌ ఈ సీజన్లో మిగిలిన డబ్యుబీబీఎల్ మరియు ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లలో పాల్గొనలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా భద్రతా అధికారి సీన్ కరోల్ మాట్లాడుతూ... 'స్మిత్‌ జట్టు లైనప్‌ను పోస్ట్ చేసి అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించింది. ఆటగాళ్లకు తమ బాధ్యతల గురించి తెలిసుండాలి. స్మిత్ తాను చేసిన తప్పును అర్థం చేసుకుంది. దురదృష్టవశాత్తు స్మిత్ చేసిన పోస్ట్ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించింది. ఇది అందరికి ఓ గుణపాఠం' అని అన్నాడు.

ఎమిలీ స్మిత్‌ టాస్మానియన్ రోర్తో జట్టుతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అనేక దేశీయ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం వెస్ట్రన్ ఫ్యూరీ, పెర్త్ స్కార్చర్స్‌ జట్లతో కలిసి ఆడుతుంది. గతంలో ఎసెక్స్ ఈగల్స్, హోబర్ట్ హరికేన్స్ జెర్సీని ధరించింది. ఇలా నిషేదానికి గురైన మొదటి ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ స్మిత్ మాత్రం కాదు. స్మిత్‌ కంటే ముందు 2016లో హేలీ జెన్సన్, కోరిన్ హాల్ కూడా నిషేధాన్ని ఎదుర్కొన్నారు. అయితే స్మిత్‌ ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు తరపున ఒక్క మ్యాచ్ ఆడలేదు.

Story first published: Monday, November 18, 2019, 16:10 [IST]
Other articles published on Nov 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+