For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'శాశ్వత సభ్యులం కాదు': లోధా సిఫార్సులకు మద్దతు

By Nageswara Rao

న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులకు బీహార్ క్రికెట్ అసోషియేషన్ మద్దతు ప్రకటించింది. బీసీసీఐ అపెక్స్ క్రికెట్ బాడీలో అన్ని రాష్ట్రాలను శాశ్వత సభ్యులుగా గుర్తించాలని లోధా చేసిన ప్రతిపాదనకు శుక్రవారం బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆదిత్య వర్మ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన 'ఇప్పటికీ బిహార్‌ సహా 11 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, పాండిచ్చేరి బీసీసీఐలో శాశ్వత సభ్యులు కావు. దీంతో ఈ రాష్ట్రాల్లో క్రికెట్‌ అభివృద్ధి, యువ క్రికెటర్ల హక్కులపై ప్రభావం పడుతుంద'ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, శాశ్వత సభ్యులుగా లేని రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు విడదల చేయడం లేదని ఆయన వెల్లడించారు.

తద్వారా ఆయా రాష్ట్రాల్లోని యువ క్రికెటర్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ఆడేందుకు నోచుకోవడం లేదన్నారు. బిహార్‌లాంటి పెద్ద రాష్ట్రానికి 2003 నుంచి శాశ్వత సభ్యత్వం లేదన్నారు. అయితే బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనేందుకు గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు మాత్రం ఏడు చొప్పున ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈ అసమానతలు తొలగిపోవాలంటే జస్టిస్ లోధా కమిటీ సిపార్సులను అమలు చేయాలని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయకపోవడం పట్ల సుప్రీం కోర్టు గురువారం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోధా కమిటీ ఇబ్బందికరమైన సిఫార్సులు ఏవైనా ఉంటే తామే గుర్తించి వాటిపై వీలైనంత తక్కువ సమయంలో నిర్ణయం తీసుకోవాలని లోధా కమిటీకి చెబుతామని చీఫ్‌ జస్టీస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఎఫ్‌ఎమ్‌ కలీఫుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 Cricket Association of Bihar supports Lodha committee's recommendations

'మీకు నామినీగా కాగ్‌ను వద్దంటున్నారు. కానీ, రాజకీయ నాయకులు కావాలా?' అని ప్రశ్నించింది. కాగ్‌ ఉంటే ఐసీసీ తమపై నిషేధం విధిస్తుందని బోర్డు ఆందోళన వ్యక్తం చేయడం భావ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. 'కాగ్‌.. నామినీ ప్రభుత్వ అధికారి కాదు. అతను బోర్డులో కోర్టు నియమించిన అధికారి మాత్రమే అవుతాడు. అలాంటప్పుడు ఐసీసీ నుంచి బోర్డుకు అడ్డంకులేమిట'ని ప్రశ్నించింది.

అంతేకాదు ఒక రాష్ట్రం-ఒక సంఘం విధానాన్ని వ్యతిరేకించడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ సంఘాలు కొనసాగుతున్నాయి. అవి తమకు కేటాయించిన ప్రాంతాల్లో పాలన సాగిస్తున్నాయని బోర్డు చెప్పింది. 'ఇలా ప్రాంతాలను ఎవరు పంచిపెట్టారు..? వీటికి ఏమైనా రాజ్యాంగాలు ఉన్నాయా? అంటూ ధర్మాసనం గట్టిగా వ్యాఖ్యానించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+