Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట్ హ్యాండిల్‌తో సచిన్ కవర్ డ్రైవ్.. ఫిదా అయిన కశ్మీర్ కుర్రాళ్లు (Video)

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై దశాబ్దం దాటినా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. బ్యాటును తలకిందులుగా పట్టుకుని హ్యాండిల్‌తో కూడా కచ్చితత్వమైన షాట్లు ఆడుతున్నాడు. 50 ఏళ్లలో కూడా సచిన్ బ్యాటింగ్ స్కిల్స్‌ను చూసి కశ్మీర్ కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం సచిన్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు కశ్మీర్‌కు వెళ్లాడు. కశ్మీర్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో పయనిస్తున్న సచిన్‌కు కశ్మీర్ కుర్రాళ్లు గల్లీ క్రికెట్ ఆడటాన్ని చూశాడు. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి బంతుల్ని ఎదుర్కొన్నాడు. డ్రైవ్, లాఫ్టెడ్ షాట్లు ఆడాడు. చివరి బంతిని ఎదుర్కొంటున్నాని ముందే చెప్పి.. బ్యాటును రివర్స్‌లో పట్టుకున్నాడు. హ్యాండిల్‌తో కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు.

Cricket and Kashmir: A MATCH in HEAVEN! - Sachin Tendulkar

దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో సచిన్ పోస్ట్ చేశాడు. 'క్రికెట్ & కశ్మీర్- స్వర్గంలో ఓ మ్యాచ్' అని దానికి క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతకుముందు అక్కడ బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీకి సచిన్ వెళ్లాడు. విల్లో టేకుతో చేసే ఆ బ్యాట్లను పరిశీలించాడు. ఫ్యాక్టరీ నిర్వాహకులతో ముచ్చటించాడు. తన తొలి బ్యాట్ కశ్మీర్ విల్లోతో చేసిందేనని, తన సోదరి ఆ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిందని సచిన్ గుర్తుచేసుకున్నాడు.

అయితే కశ్మీర్‌కు వస్తున్న సచిన్‌కు విమానంలో ఘన స్వాగతం లభించింది. సచిన్ విమానంలోకి రాగానే.. అక్కడ ఉన్న వారంతా సచిన్.. సచిన్.. అంటూ నినాదాలు చేశారు. వాళ్ల ప్రేమకు సచిన్ ధన్యావాదాలు చెప్పి తన సీటుతో కూర్చున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన పదేళ్లు దాటినా సచిన్ క్రేజ్ ఏ మాత్రం దక్కలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, సచిన్ తన కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు.సుదీర్ఘ ఫార్మాట్‌లో 51 సెంచరీలు చేసిన సచిన్ 53 సగటుతో 15921 పరుగులు చేశాడు. 2013లో వెస్టిండీస్‌పై తన చివరి టెస్టు ఆడాడు. వన్డేల్లో 49 శతకాలు బాదిన సచిన్ 18426 పరుగులు చేశాడు. 2012లో పాకిస్థాన్‌పై ఆఖరి వన్డే ఆడాడు. సచిన్ తన కెరీర్‌లో వన్డే ఫార్మాట్ మినహా ఐపీఎల్‌తో సహా ఆఖరి మ్యాచ్‌లన్నీ ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనే ఆడాడు.

Story first published: Thursday, February 22, 2024, 11:52 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+