For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్‌తో డేటింగ్ వార్తలపై వివరణ ఇచ్చిన బాలీవుడ్ నటి

Cricekt Bollywood heroine Sonal Chauhan breaks her silence on dating rumours with cricketer KL Rahul

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి సోనాల్‌ చౌహాన్‌ స్పందించింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై బుధవారం ఓ ఇంటర్యూలో ఆమె వివరణ ఇచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
"కేఎల్‌ రాహుల్‌ మంచి క్రికెటర్‌. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడు. నేను అతనితో డేటింగ్‌లో లేను. ఈ విషయంలో ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే వార్తలను సృష్టించిన వారినే ఆడగండి" అని ఆమె స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి వార్తలు కొందరు పనిగట్టుకుని మరీ సృష్టిస్తారని ఆమె మండిపడ్డారు.

అయితే, కేఎల్ రాహుల్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో అతడు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ఇద్దరూ ఖండించడం విశేషం. కేఎల్ రాహుల్ ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌లో ఉన్నాడు.

మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు. దీంతో వరల్డ్‌కప్‌లో NO.4 స్థానంలో కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తుంది. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న కేఎల్‌ రాహుల్‌ కేవలం 10 బంతులాడి 6 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఇక, బంగ్లాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా రాహుల్ NO.4 స్థానంలోలోనే క్రీజులోకి వచ్చాడు.

స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు పడిన దశలో కేఎల్ రాహుల్.... ధోనీతో కలిసి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ 94 బంతుల్లో (108; 99 బంతుల్లో 12 పోర్లు, 4 సిక్సులు)తో సెంచరీని సాధించాడు. కాగా, వరల్డ్‌కప్ తొలి పోరులో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న తలపడనుంది.

Story first published: Wednesday, May 29, 2019, 17:41 [IST]
Other articles published on May 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+