ముంబై: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇక విశ్లేషకుని అవతారం ఎత్తనున్నాడు. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్‌కు విశ్లేషకుని(అనలిస్టు)గా వ్యవహరించేందుకు వీరేంద్ర సెహ్వాగ్ అంగీకరించాడు.

టీ20 ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లను తమ సంస్థ తరఫున విశ్లేషించేందుకు వీరూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రిక్‌బజ్ సీఈవో పంకజ్ తెలిపాడు.
గతంలో పలు టీవీ ఛానెల్స్‌లో క్రికెట్ కార్యక్రమాల్లో విశ్లేషకుడిగా పని చేసిన సెహ్వాగ్.. ఓ వెబ్‌సైట్‌తో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. కాగా, టోర్నీ సందర్భంగా క్రిక్‌బజ్ వీక్షకులు సందేహాలకు తనదైన శైలిలో వీరూ సమాధానాలు ఇవ్వనున్నాడు.