కోహ్లీకి అరుదైన గౌరవం.. ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా విరాట్!!

ముంబై: టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ క్రికెట్ స్పోర్ట్స్ సంస్థ 'క్రిక్‌బజ్' ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. క్రిక్‌బజ్ ప్రకటించిన రెండు జట్లకు కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం. ఓ భారత క్రికెటర్‌కు ఇలాంటి గౌరవం లభించడం ఇదే తొలిసారి కూడా. ఈ దశాబ్దంలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపికచేసినట్టు క్రిక్‌బజ్ పేర్కొంది.

కీపర్‌గా బట్లర్‌కు చోటు:
వన్డే జట్టులో ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఎంచుకుంది. అతనికి జోడిగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిం ఆమ్లాను తీసుకుంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. మూడో నంబర్‌లో సరైన ఆటగాడు కోహ్లీనే అని క్రిక్‌బజ్ పేర్కొంది. కోహ్లీతో పాటు రాస్ టైలర్, ఏబీ డివిలియర్స్ మిడిల్ భారాన్ని మోయనున్నారు. జోస్ బట్లర్‌కు వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. ఎంఎస్ ధోనీని కాకుండా బట్లర్‌ను తీసుకోవడం విశేషం.

పాకిస్థాన్, వెస్టిండీస్‌ల నుంచి ఎవరూ లేరు:
షకిబ్ అల్ హసన్ ఆల్‌రౌండర్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, ఇమ్రాన్ తాహిర్‌లకు క్రిక్‌బజ్ అవకాశం ఇచ్చింది. తాహిర్‌కు అండగా షకిబ్ ఉన్నాడు. పాకిస్థాన్, వెస్టిండీస్‌ల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం విశేషం. గేల్, బ్రేవో, రసెల్, హోల్డర్ లాంటి వారిని క్రిక్‌బజ్ మరిచినట్టుంది.

కెప్టెన్‌గా కోహ్లీ:
టెస్టు జట్టు కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీని క్రిక్‌బజ్ ఎంపిక చేసింది. ఓపెనర్లుగా అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్‌లకు చోటు దక్కింది. కుమార సంగక్కర, స్టీవ్ స్మిత్, డివిలియర్స్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రంగన హెరాత్, డేల్ స్టెయిన్, మోర్ని మోర్కెల్, జేమ్స్ అండర్సన్‌లను దశాబ్దపు ఉత్తమ టెస్టు జట్టులో చోటు దక్కింది.

క్రిక్‌బజ్ వన్డే జట్టు:
రోహిత్ శర్మ, హాషిం ఆమ్లా, విరాట్ కోహ్లీ, రాస్ టైలర్, ఏబీ డివిలియర్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షకిబ్ అల్ హసన్, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ.

క్రిక్‌బజ్ టెస్ట్ జట్టు:
అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, డివిలియర్స్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రంగన హెరాత్, డేల్ స్టెయిన్, మోర్ని మోర్కెల్, జేమ్స్ అండర్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications