వర్షంలో కొట్టుకుపోయిన జింబాబ్వే ప్రపంచకప్ ఆశలు

హైదరాబాద్: టెస్టు హోదా ఉన్న జింబాబ్వే 2019 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్‌లో భాగంగా యూఏఈతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమిపాలైంది. చివరి బంతికి సిక్సర్ కొడితే జింబాబ్వే గెలిచేదే. వర్షం బారిన పడటంతో చివరి మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో యూఏఈ చేతిలో ఓడింది.
క్రీజులో ఉన్న ఇర్విన్ రెండు పరుగులే చేయడంతో యూఏఈ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రమీజ్ (59) టాప్ స్కోరర్. వర్షం కారణంగా జింబాబ్వే లక్ష్యాన్ని 40 ఓవర్లలో 230కి కుదించగా..సీన్ విలియమ్స్ (80) పోరాడినా, జింబాబ్వే 226/7కే పరిమితమై ఓటమిపాలైంది.
యూఏఈ 235 పరుగులు సాధించగా... విజయానికి 230 పరుగులు (డక్‌వర్త్ లూయీస్ ప్రకారం) చేయాల్సిన స్థితిలో జింబాబ్వే 226 పరుగులకే పరిమితమైంది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచ కప్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం అఫ్గానిస్తాన్, ఐర్లాండ్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేత వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే రన్‌రేట్ ప్రకారం ఐర్లాండ్ ముందుకు వెళుతుంది.
ఆతిథ్య జట్టు ఓటమితో ఆప్ఘనిస్థాన్, ఐర్లండ్ జట్లకు ఫైనల్ దారి సుగమమైంది. నేడు ఈ రెండు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఈనెల 25న వెస్టిండీస్‌తో ఫైనల్లో తలపడటంతో పాటు 2019 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications