రిషబ్ పంత్ వల్లే!: తొలి మ్యాచ్ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ


హైదరాబాద్: ఐపీఎల్‌లో తొలి గేమ్ ఏ జట్టుకైనా ఛాలెంజింగ్‌గా ఉంటుందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఆదివారం వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ క్రెడిట్ అంతా యువ హిట్టర్ రిషబ్ పంత్‌కి ఇచ్చాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
"తొలి గేమ్ ఏ జట్టుకైనా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు ఉంటారు. అయినా, ఆటలో మేం చాలా తప్పిదాలు చేశాం. అందుకే ఓటమిపాలయ్యాం. తొలి 10 ఓవర్లు మా బౌలింగ్ బాగానే ఉంది. కానీ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాం" అని రోహిత్ శర్మ అన్నాడు.

కొత్త ఆటగాళ్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం
"జట్టులోని కొత్త ఆటగాళ్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మేమంతా ఫ్రొఫెషనల్ క్రికెటర్స్ కాబట్టి త్వరగా మా తప్పిదాలను గుర్తించి తేరుకోగలం. ఈ రోజు ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాం. పిచ్ పేసర్స్‌కు అనుకూలంగా ఉంటుందని స్పిన్నర్‌ను తీసుకోలేదు. మళ్లీ ప్రత్యర్థి జట్టులో చాలా మంది ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ఉండటంతో లెగ్ స్పిన్నర్ అవసరమా? అనిపించింది" అని రోహిత్ శర్మ అన్నాడు.

ఎలా ముందుకు సాగాలో స్పష్టత ఉంది
"మేం టోర్నిలో ఎలా ముందుకు సాగాలో మాకు స్పష్టత ఉంది. తర్వాతి మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను బట్టి మా జట్టు కూర్పు ఉంటుంది. ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. యువీ అద్భుతంగా ఆడాడు. మేం ఇంకో 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే పరిస్థితి మరోలా ఉండేది" అని రోహిత్ శర్మ తెలిపాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది.
యువరాజ్ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్య (0) కూడా ఔటవడంతో మ్యాచ్‌పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది.
సిక్సర్లతో చెలరేగిన రిషబ్ పంత్
అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications