వామ్మో పంత్ క్రేజ్ చూశారా?.. ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమోలో గాడ్జిల్లా సైజులో రిషబ్ పంత్ ఎంట్రీ..!

భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ గత కొన్నేళ్లుగా వరల్డ్ క్లాస్ క్రికెటర్‌గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత మోడర్న్ క్రికెట్లో రిషబ్ పంత్ మంచి ప్రజాదరణ ఉన్న ప్లేయర్ కూడా. ఎటాకింగ్ గేమ్ ఆడడంతో పాటు.. దిగ్గజ బౌలర్లను ఎదుర్కోవడంలో పంత్ నానాటికి మెరుగుపడుతున్నాడు. జేమ్స్ అండర్సన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్ల బౌలింగ్లో సైతం అతను రివర్స్ ల్యాప్ షాట్లు ఆడుతూ డేర్ గేమ్‌కు బ్రాండ్‌గా మారుతున్నాడు. పంత్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం కావడంతో పంత్ కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టాడు.
ఆసీస్ గడ్డ మీద స్పెషల్ ప్లేయర్‌గా పంత్
ఇక 2020 - 21 టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాపై భారత్ చిరస్మరణీయ టెస్ట్ సిరీస్ గెలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ గబ్బాలో జరగగా.. చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో క్రికెట్ దిగ్గజాలే కాకుండా.. ఆసీస్‌లోని క్రికెట్ ఉద్దండులు, అభిమానులు సైతం పంత్ యొక్క వీరోచిత పోరాటాన్ని వేనోళ్ల కొనియాడారు. దీంతో ఆసీస్ గడ్డపై అతన్ని స్పెషల్ ప్లేయర్‌గా అప్పటి నుంచి ట్రీట్ చేస్తున్నారు.

వెల్ కం టు ది బిగ్ టైమ్ రిషబ్ పంత్ అంటూ..
ఇకపోతే ఈసారి టీ20 ప్రపంచకప్ ఆసీస్లో జరగనుండడంతో.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రమోషన్లకు సిద్ధమైంది. ఇక ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేసిన ఐసీసీ.. కింద్ క్యాప్షన్లో వెల్ కం టు ది బిగ్ టైమ్ రిషబ్ పంత్ అంటూ నేర్కొంది. ప్రోమోలో ఒక హెలికాప్టర్ సిడ్నీ ఒపేరా హౌస్ మీదుగా తిరుగుతుండగా.. నదిలో నుంచి 'గాడ్జిల్లా' మాదిరిగా ఓ పెద్ద ఆకారంలో పంత్ బయటికొస్తుంటాడు. అతను తన క్లాసిక్ 'డ్రాగింగ్ ది బ్యాట్' నడకలో నడుస్తూ కన్పించాడు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీ ప్రోమోలో వెల్ కమ్ పర్సన్‌గా పంత్‌ను చూపించడాన్ని పంత్ అభిమానులు హర్షిస్తున్నారు.

భారత జట్టులో కీలక ప్లేయర్‌గా
ఇకపోతే రిషబ్ పంత్ ఇప్పుడు భారత జట్టులో చాలా కీలకమైన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అతన్ని ఇటీవల బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా కూడా టీం ప్రయోగించించింది. నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో పంత్ రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఉన్నంత సేపు బ్యాట్ ఝుళిపించాడు. శక్తివంతమైన ఇంగ్లాండ్ బౌలింగ్ లైనప్‌ను అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మీద ఇండియా 49పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇకపోతే UAEలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా నాకౌట్ దశకు కూడా చేరుకోలేక విఫలమైంది. దీంతో టీ20 ఫార్మాట్‌కు పూర్తిగా అత్యుత్తమ ప్లేయర్లతో కూడిన జట్టును తయారు చేయాలని టీమిండియా మేనేజ్ మెంట్ వరుసగా సిరీస్‌లు ఆడిస్తూ.. ప్లేయర్లను పరిశీలిస్తుంది. ఏదేమైనా టీమిండియా టీ20 టీం ప్రస్తుతం చాలా పటిష్ఠంగా కన్పిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications