కివీస్ బ్యాటింగ్ కోచ్ పదవి నుండి తప్పుకున్న క్రేగ్ మెక్‌మిలన్

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ పదవి నుండి క్రేగ్ మెక్‌మిలన్ (42) తప్పుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ అయిన మెక్‌మిలన్ కోచ్ పదవి ఒప్పందాన్ని పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసాడు. తాజాగా ముగిసిన ప్రపంచకప్ టోర్నీతో న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్‌గా మెక్‌మిల్లన్ ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తయింది. దీంతో మెక్‌మిల్లన్ తన పదవికి రాజీనామా చేసాడు. ఈ విషయాన్ని మెక్‌మిలన్ తన అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
'నా పదవీ కాలం ముగిసింది. కివీస్ జట్టుతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఐదేళ్ల పాటు అనేక మంది ఆటగాళ్లు, ఇతర సిబ్బందితో కలిసి పనిచేయడం బాగుంది. న్యూజిలాండ్ జట్టు ఎంతో ప్రత్యేకమైంది. అత్యుత్తమ స్థాయిలో విజయపరంపరను కొనసాగిస్తుంది. మంచి క్రీడాస్ఫూర్తి కలిగిన కివీస్ జట్టు న్యూజిలాండ్‌కే గర్వకారణం' అని మెక్‌మిలన్ పేర్కొన్నారు.
మెక్‌మిలన్ ఆధ్వర్యంలో కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంతో మెరుగుపడింది. బ్యాటింగ్ కోచ్‌గా మెక్‌మిలన్ విజయవంతం కావడం వల్ల న్యూజిలాండ్ వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ రన్నరప్ (2015, 2019)గా నిలిచింది. మెక్‌మిలన్ నిష్క్రమించడంతో ఈ పదవిలోకి ఎవరు వస్తారో కివీస్ బోర్డు ఇంకా తెలపలేదు. మెక్‌మిలన్ న్యూజిలాండ్ తరఫున 55 టెస్టులు, 197 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను న్యూజిలాండ్ ఆటగాడిగా ఒక దశాబ్దం పాటు జట్టులో ఉన్నాడు.
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నీకోల్స్ (55), లాతమ్ (47) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లు వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (84నాటౌట్; 98బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటం చేశాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది.
సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. బట్లర్, స్టోక్స్ చెరో బౌండరీ బాదారు. ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. నీశమ్ ఒక సిక్స్ బాదాడు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఇంగ్లండ్ అత్యధిక బౌండరీలు సాధించడంతో కప్ గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications