న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్యాచ్‌కా బాప్.. గాల్లో డైవ్‌ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టిన కాచోపా (వీడియో)

New Zealand Cricketer's Unbelievable One-Handed Flying Catch || Oneindia Telugu
Craig Cachopa took an unbelievable one-handed catch to dismiss Devon Conway in Super Smash final

వెల్లింగ్టన్‌: క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కష్టమైన క్యాచ్‌లను కూడా ఒడిసిపట్టేస్తున్నారు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్‌ పట్టి బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేర్చుతున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్‌ కొట్టి మరీ అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆక్లాండ్‌ ఆటగాడు క్రెయిగ్ కాచోపా అందుకున్నాడు.

<strong>పృథ్వీషా మెరుపులు.. 100 బంతుల్లో 150 పరుగులు.. రీఎంట్రీ ఖాయమేనా?</strong>పృథ్వీషా మెరుపులు.. 100 బంతుల్లో 150 పరుగులు.. రీఎంట్రీ ఖాయమేనా?

గాల్లో డైవ్‌ కొట్టి క్యాచ్‌ పట్టిన కాచోపా

ఆదివారం న్యూజిలాండ్‌ వేదికగా దేశీయ టోర్నమెంట్ సూపర్‌ స్మాష్‌ టీ20 లీగ్‌ ముగిసింది. వెల్లింగ్టన్‌ ఫైర్‌బర్డ్స్, ఆక్లాండ్‌ ఏసెస్ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదటగా వెల్లింగ్టన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (49) క్రీజులో ఉన్నాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్‌లీన్‌గన్‌ బౌలింగ్ చేస్తున్నాడు. మెక్‌లీన్‌గన్‌ బౌలింగ్‌లో కాన్వే మిడ్‌ ఆఫ్‌ మీదుగా షాట్‌ ఆడగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కాచోపా గాల్లో డైవ్‌ కొట్టి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.

'క్యాచ్‌కా బాప్'

'క్యాచ్‌కా బాప్'

క్యాచ్ పట్టిన అనంతరం కాచోపా బంతిని గాల్లోకి విసిరి సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు మెక్‌లీన్‌గన్‌ తనదైన స్టయిల్లో కాచోపాను అభినందించాడు. కాచోపా క్యాచ్ పట్టిన తీరుకు డెవాన్‌ కాన్వే ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. కాచోపా పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు 'క్యాచ్‌కా బాప్' అని ట్వీట్లు చేస్తున్నారు.

వెల్లింగ్టన్‌ విజయం

వెల్లింగ్టన్‌ విజయం

ఆక్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వెల్లింగ్టన్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెల్లింగ్టన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓ దశలో 150 పరుగులు కూడా దాటడం కష్టమని అనిపించినపుడు డచ్ వికెట్ కీపర్ లోగాన్ వాన్ బీక్ కేవలం 8 బంతుల్లో అజేయంగా 15 పరుగులు చేసాడు. లక్ష్య ఛేదనలో ఆక్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసి ఓటమి పాలైంది.

కామెరాన్‌ సూపర్‌మ్యాన్‌ క్యాచ్

గత నవంబర్ నెలలలో మార్ష్‌ వన్డే కప్‌లో భాగంగా విక్టోరియా-సౌత్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్‌ వాలెంటే ఇలాంటి క్యాచే అందుకున్నాడు. కేన్‌ రిచర్డ్‌సన్‌ వేసిన ఓ బంతిని హ్యాండ్‌స్కాంబ్‌ మిడ్‌ఆఫ్‌-ఎక్స్‌ ట్రా కవర్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. బంతి పైకి లేవగా.. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న కామెరాన్‌ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో డైవ్‌ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా హ్యాండ్‌స్కాంబ్‌ షాకయ్యాడు.

Story first published: Sunday, January 19, 2020, 15:28 [IST]
Other articles published on Jan 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X