Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL2023: డివిలియర్స్‌లా ఆడబోతే.. బంతి తగిలి హెల్మెట్ ఊడిపోయింది!

క్రికెట్‌లో ఒక్కోసారి జరిగే ఘటనలు చూస్తే కానీ నమ్మబుద్ధి కావు. అలాంటి ఘటనే తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో వెలుగు చూసింది. సెయింట్ లూసియా కింగ్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన జాన్సన్ చార్లెస్ (37)కు వింత అనుభవం ఎదురైంది.

నైట్ రైడర్స్ స్టార్ పేసర్ డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో.. డివిలియర్స్ తరహా స్కూప్ షాట్ ఆడేందుకు చార్లెస్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. ఈ బంతి వచ్చి చార్లెస్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతని హెల్మెట్ ఊడిపోయింది. వెనక్కు పడి వికెట్లు తగిలితే అతను హిట్‌వికెట్‌గా వెనుతిరగాల్సి వచ్చేది. అయితే కొంత తెలివి చూపించిన చార్లెస్.. హెల్మెట్‌ను కాలితో పక్కకు తన్నేయడానికి ప్రయత్నించాడు.

CPL2023 helmet blown off a delivery

ఇది పూర్తి సక్సెస్ కాకపోయినా.. అతని కాలు తగిలిన హెల్మెట్ వికెట్ల పక్కన పడటంతో బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బంతి తగిలి బ్యాటర్ హెల్మెట్ ఊడిపోవడం తొలిసారి చూస్తున్నామని వీడియో చూసిన ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ తర్వాత తేరుకున్న చార్లెస్ బ్యాటుతో ఫర్వాలేదనిపించాడు. అతనితోపాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (57), సికందర్ రజా (32) కూడా రాణించారు.

దీంతో సెయింట్ లూసియా కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ట్రింబాగో నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. ఖ్యారీ పీర్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆ జట్టు 14.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన సికందర్ రజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ' అవార్డు దక్కింది.

Story first published: Sunday, August 27, 2023, 18:14 [IST]
Other articles published on Aug 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+