Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2021 Final: ఫైనల్లో తలపడే సెంట్‌ కిట్స్‌, సెయింట్ లూసియా జట్లు ఇవే.. మ్యాచ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!!

CPL Final 2021: SLK vs SNP Playing 11, Date, Time, TV Channel And Live Streaming Info

హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021 చివరి అంకానికి చేరుకుంది. డ్వేన్ బ్రావో నేతృత్వంలోని సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌, ఆండ్రీ ఫ్లెచర్ నాయకత్వంలోని సెయింట్ లూసియా కింగ్స్ ఈరోజు ఫైనల్ పొరులో తలపడనున్నాయి. వార్నర్ పార్క్ మైదానంలో సీపీఎల్‌ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెంట్‌ కిట్స్‌ వేదికగా బుధవారం రాత్రి 7.30 మ్యాచ్ ఆరంభం కానుంది. డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియమ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా అందించే ప్రత్యేక ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫాన్స్ లైవ్ మ్యాచ్ చూడొచ్చు.

మంగళవారం గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్‌ కిట్స్‌ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ ఎవిన్ లూయిస్‌ (39 బంతుల్లో 77 నాటౌట్‌, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసానికి తోడూ క్రిస్‌ గేల్‌ (27 బంతుల్లో 42, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ బ్రేవో 31 బంతుల్లో 34,3 ఫోర్లు, 1 సిక్సర్‌) తోడవ్వడంతో సునాయాసంగా విజయం సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్‌ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ 27, హేమరాజ్ చంద్రపాల్‌ 27 పరుగులు చేశారు.

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మరో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ గెలిచి ఫైనల్ చేరింది. ఈ మ్యాచులో మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మార్క్ డెల్ (44 బంతుల్లో 78, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రోస్టన్ చేజ్ (21 బంతుల్లో 36, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వీస్ (21 బంతుల్లో 34, 1 ఫోర్, 4 సిక్సర్లు), టీమ్ డేవిడ్ (17 బంతుల్లో 38, 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. భారీ లక్ష్య చేధనల ట్రిన్‌బాగో 18.3 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది. సునీల్ నరైన్ (30) టాప్ స్కోరర్. మున్రో (28), రాందిన్ (29), బ్రావో (25), పొల్లార్డ్ (26) నిరాశపరిచారు.

జట్లు:
సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్:
ఫాఫ్ డుప్లెసిస్, ఆండ్రీ ఫ్లెచర్ (కెప్టెన్), కేస్రిక్ విలియమ్స్, కదీమ్ అలీన్, సమిత్ పటేల్, కీమో పాల్, ఉస్మాన్ ఖాదిర్, వహబ్ రియాజ్, జేవర్ రాయల్, కెరాన్ కొట్టాయ్, రహకీమ్ కార్న్‌వాల్, ఓబెడ్ మెక్కాయ్, మార్క్ డయల్, రోస్టన్ చేజ్, జావెల్లీ గ్లెన్, అల్జర్రి జోసెఫ్.

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పాట్రోయిట్స్ స్క్వాడ్:
రాయద్ ఎమ్రిట్, షెల్డన్ కాట్రెల్, ఎవిన్ లూయిస్, ఫాబియన్ అలెన్, జోన్-రస్ జగ్గసర్, డొమినిక్ డ్రేక్స్, డెవాన్ థామస్, కోలిన్ ఆర్చిబాల్డ్, మైకిల్ లూయిస్, ఆసిఫ్ అలీ, రవి బోపారా, ఫవాద్ అహ్మద్, పాల్ వాన్ మీకెరెన్, డ్వేన్ బ్రావో (కెప్టెన్), జాషువా డా సిల్వా, క్రిస్ గేల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.

Story first published: Wednesday, September 15, 2021, 13:45 [IST]
Other articles published on Sep 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+