Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పూరన్ విధ్వంసం.. సిక్సర్ల వర్షంతో రికార్డు ఛేజింగ్ (Video)

వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ పొట్టి ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
ట్రింబాగో నైట్ రైడర్స్‌‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పూరన్.. ట్రిండాడ్ వేదికగా సెయింట కిట్స్ అండ్ నేవిస్ పేట్రియట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లుతో విరుచుకుపడ్డాడు. 43 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు.

పూరన్ ధాటికి మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే ట్రింబాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రిండాడ్‌లో వేదికలో పరుగుల పరంగా ఇదే అత్యంత విజయవంతమైన ఛేదన. మొదట బ్యాటింగ్ చేసిన పేట్రియట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్ (93; 61 బంతుల్లో, 4 ఫోర్లు, 6 సిక్సర్లు), మేయర్స్ (60; 30 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

CPL 2024 Nicholas Pooran Powers TKR to Historic Run Chase Victory

అనంతరం ఛేదనకు దిగిన నైట్ రైడర్స్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. వన్‌డౌన్‌‌లో వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. పూరన్‌తో పాటు ఓపెనర్ జేసన్ రాయ్ (64; 34 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా సత్తాచాటాడు. ట్రింబాగో నైట్ రైడర్స్‌కు పొలార్డ్ సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, టీ20ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న పూరన్ ఇటీవల ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టాడు. గేల్ పేరిట ఉన్న 2015లో 135 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లోనూ గేల్‌యే ఉన్నాడు. 2012లో గేల్ 121 సిక్సర్లు, 2011లో 116 సిక్సర్లు, 2016లో 112 సిక్సర్లు సాధించాడు.

Story first published: Monday, September 23, 2024, 12:58 [IST]
Other articles published on Sep 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+