Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2023: పరిగెత్త లేక రనౌట్ అయిన బిగ్ హిట్టర్.. ఫిట్‌నెస్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

క్రికెట్ అనే కాదు. ఏ క్రీడలో అయినా ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. అది లేకుండా ఆటగాళ్లు తమ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేరు. ఆ విషయంలో తాజాగా జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023 మ్యాచ్‌లో మరోసారి రుజువైంది. విండీస్ ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్ ఈ మ్యాచ్‌లో అవమానకర రీతిలో రనౌట్ అయ్యాడు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత భారీ క్రికెటర్‌గా కార్న్‌వాల్‌కు పేరు. భారీ ఆకారంతో ఉండే అతను ఆల్‌రౌండర్‌గా వెస్టిండీస్ తరఫున కొన్ని కీలక ఇన్నింగ్సులు ఆడాడు. బిగ్ హిట్టర్‌గా పేరున్న అతను సీపీఎల్ టీం బార్బడోస్ రాయల్స్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్‌తో ఈ టీం తలపడింది.

cpl-2023-star-cricketer-embarassing-run-out-as-he-couldnt-run

ఈ మ్యాచ్‌లో రకీం కార్న్‌వాల్ కనీసం ఖాతా తెరవకుండా రనౌట్ అయ్యాడు. తను ఎదుర్కొన్న తొలి బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ సోల్ ఆ బంతిని అడ్డుకోవడంలో తడబడ్డాడు. దీంతో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కైల్ మేయర్స్ పరుగు కోసం కార్న్‌వాల్‌ను రమ్మన్నాడు.

దీనికి స్పందించిన కార్న్‌వాల్ రన్ తీసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే తేరుకున్న క్రిస్ సోల్ నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను కూల్చాడు. మరో బ్యాటర్ ఎవరైనా సరే ఆ పరుగు పూర్తి చేసేవారే. కానీ కార్న్‌వాల్ అంత భారీ కాయంతో వేగంగా పరుగు తీయలేకపోయాడు. దీంతో అవమానకర రీతిలో రనౌట్ అయ్యాడు.

మామూలుగానే అతని భారీ కాయం చూసిన ప్రతిసారీ కార్న్‌వాల్ ఫిట్‌నెస్‌ను ఫ్యాన్స్ ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఇలా రనౌట్ అవడంతో మరోసారి అతని ఫిట్‌నెస్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే తను చాలా మంచి డైట్ ఫాలో అవుతున్నానని, కానీ బరువు తగ్గకపోతే తనేం చేయలేనని కార్న్‌వాల్ ఇటీవల వెల్లడించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కార్న్‌వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బార్బడోస్ రాయల్స్ కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. కార్న్‌వాల్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ టీం ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.

Story first published: Sunday, August 20, 2023, 11:07 [IST]
Other articles published on Aug 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+