Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2023: క్యాచ్ వదిలేసిన మరుసటి బంతికే.. స్టన్నింగ్ క్యాచ్ పట్టేసిన ఆర్సీబీ స్టార్!

వయసు పెరిగే కొద్దీ మరింత ఫిట్‌గా మారుతున్న క్రికెటర్లలో సఫారీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఒకడు. 39 ఏళ్ల వయసులో కూడా అతను మైదానంలో చిరుతలా కదులుతూ కుర్రాళ్ల కన్నా అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా కరీబియిన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో కూడా అలాంటి ఘటనే జరిగింది.

డుప్లెసిస్ కెప్టెన్సీలోని సెయింట్ లూసియా కింగ్స్ జట్టు .. జమైకా తలవాస్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా టీం 187 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ టీం కెప్టెన్ బ్రాండన్ కింగ్ (53 బంతుల్లో 81) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జమైకా ఇన్నింగ్స్‌లో తన వైపు వచ్చిన ఒక క్యాచ్‌ను డుప్లెసిస్ నేలపాలు చేశాడు.

CPL 2023

ఇది చూసిన అందరూ డిసప్పాయింట్ అయ్యారు. డుప్లెసిస్‌కు మాత్రం తన మీద తనకే కోపం వచ్చేసింది. తిట్టుకుంటూ ఫీల్డింగ్‌కు నిలబడ్డాడు. ఆ మరుసటి బంతికే అద్భుతంగా ఆడుతున్న బ్రాండన్ కింగ్ కొట్టిన బంతి అతని వైపు వచ్చింది. దీన్ని ఎలాగైనా పట్టేయాలని దూసుకెళ్లిన డుప్లెసిస్.. డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

ఈ క్యాచ్ పట్టేయగానే సంతోషంతో నవ్వేసిన డుప్లెసిస్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే బ్యాటింగ్‌లో డుప్లెసిస్ (9) పెద్దగా రాణించలేదు. జమైకా టీంలో మిగతా ప్లేయర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఛేజింగ్‌లో రోస్టన్ ఛేజ్ (53), రోస్టన్ ప్రైమస్ (37) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోస్టన్ ఛేజ్ బంతితో కూడా ఈ మ్యాచ్‌లో రాణించాడు. మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.

అయితే జమైకా టీంలో మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెయిట్ లూసియా టీం 11 పరుగుల తేడాతో జయకేతనం ఎగరేసింది. బ్యాటుతో అద్భుతంగా రాణించిన బ్రాండన్ కింగ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

Story first published: Thursday, August 17, 2023, 17:54 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+