Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2023: భారీ కాయుడి బాహుబలి సెంచరీ.. ఇది కదా ఊచకోత అంటే..!

క్రికెట్‌లో అత్యంత భారీ కాయుడు రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కార్న్‌వాల్ రెచ్చిపోయాడు. ఎస్‌కేఎన్ పాట్రియాట్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాట్రియాట్స్ 220 పరుగుల భారీ స్కోరు చేశారు. పాట్రియాట్స్ ఓపెనర్లు ఆండ్రీ ఫ్లెచర్ (56), విల్ స్మీడ్ (63) అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు.

ఇక చివర్లో కెప్టెన్ షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (65 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. దీంతో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బార్బడోస్‌కు కూడా మంచి ఆరంభం దక్కింది. కైల్ మేయర్స్ (22) ఫర్వాలేదనిపించాడు. అదే సమయంలో మరో ఓపెనర్ రకీం కార్న్‌వాల్ (102) చెలరేగాడు. కేవలం 48 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Biggest cricketer in the world Rahkeem Cornwall blasts a century.

రకీంను ఎలా అడ్డుకోవాలో కూడా పాట్రియాట్స్ బౌలర్లకు అర్థం కాలేదు. ఎలాంటి బంతి వేసినా కూడా దాన్ని బౌండరీకి తరలించాడీ భారీ కాయుడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ చేసిన అనంతరం.. బ్యాట్ డ్రాప్‌తో కొత్తగా తన శతకాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు. రకీం ఒక బ్యాటింగ్ బీస్ట్ అంటూ కితాబిస్తున్నారు.

ఈ బాహుబలి ఇన్నింగ్స్ తర్వాత రిటైర్డ్ అవుట్‌గా అతను మైదానం వీడాడు. దీంతో పాట్రియాట్స్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన లారీ ఇవాన్స్ (24) కూడా వేగంగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ (26 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగాడు.

అయితే చివర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంలో అతను ఫెయిలయ్యాడు. అతనికి చక్కగా సహకరించిన అథనాజే (13 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. వీళ్లిద్దరూ చక్కగా ఆడటంతో బార్బడోస్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసుకోవడంతోపాటు సెంచరీతో చెలరేగిన రకీంకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Monday, September 4, 2023, 10:32 [IST]
Other articles published on Sep 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+