Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ ఇచ్చిన ధైర్యంతో ట్రోఫీ నెగ్గిన కెప్టెన్.. ఎమోషనల్ అయిపోతూ వీడియో!

కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2023)లో సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చరిత్ర సృష్టించాడు. అతని కెప్టెన్సీలోని గయానా అమెజాన్ వారియర్స్ ఈ లీగ్ టైటిల్ నెగ్గింది. ఫైనల్ మ్యాచులో గయానా 9 వికెట్లతో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టును చిత్తు చేసింది. ఈ విజయం నేపథ్యంలో కెప్టెన్ ఇమ్రాన్ తాహీర్ భావోద్వేగానికి గురయ్యాడు. తనపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యావాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ లీగులో ఇమ్రాన్ తాహిర్ ఓవరాల్‌గా 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం తాహిర్ వయసు 44 ఏళ్లు. ఇంత పెద్ద వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా తాహిర్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ధోనీ 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.

CPL 2023 Imran Tahir thanks Ravichandran Ashwin after winning

ఇలా సీపీఎల్ 2023 టైటిల్ నెగ్గిన సందర్భంగా ఎమోషనల్ అయిపోయిన తాహిర్.. తనకు గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు చాలామంది నెగిటివ్‌గా మాట్లాడారని, తనపై జోకులు పేల్చారని గుర్తుచేసుకున్నాడు. గత సీజన్లలో ఈ టీంకు వెస్టిండీస్ స్టార్ షిమ్రాన్ హెట్మెయర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈ సీజన్‌లో తాహిర్‌కు జట్టు పగ్గాలు అందజేశారు. కెప్టెన్‌గా తాహిర్‌కు ఇదే తొలి సీజన్.

ఈ క్రమంలో టైటిల్ గెలిచిన తాహిర్ కన్నీటిన దాచుకోవడానికి చాలా ప్రయత్నించాడు. తనకు ఇలాంటి అవకాశం అందించిన ఆ భగవంతుడికి, సీపీఎల్‌కు, అలాగే తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన ధైర్యంతోనే తను టైటిల్ గెలిచానని అన్నాడు. అందరూ తనపై జోకులు వేస్తున్న సమయంలో అశ్విన్ అండగా నిలిచాడని వెల్లడించాడు.

'సీజన్ ఆరంభంలోనే అశ్విన్ నాకు ఫోన్ చేశాడు. సీజన్ మొదలవడానికి ముందే నేను సీపీఎల్ ట్రోఫీ నెగ్గుతానని, ఆ సత్తా నాకుందని నమ్మకం ఇచ్చాడు' అని తాహిర్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Tuesday, September 26, 2023, 11:00 [IST]
Other articles published on Sep 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+