
తొలి మ్యాచ్‌లో ఎవరెవరు?
కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. సెయింట్ కిట్స్‌లోని బస్సేటెర్రెలోని వార్నర్ పార్క్ స్టేడియం దీనికి వేదికగా మారింది. ఆరంభ మ్యాచ్‌లో గయానా అమేజాన్ వారియర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతోన్నాయి.
గయానా వారియర్స్‌కు నికొలస్ పూరన్, ట్రింబాగో నైట్ రైడర్స్‌కు కీరన్ పొల్లార్డ్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఐపీఎల్ ద్వారా వారిద్దరూ మనకు చిరపరిచితులయ్యారు. పూరన్ పంజాబ్ కింగ్స్‌లో, పొల్లార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతోన్నారు.

భారత్‌లో లైవ్ టెలికాస్ట్ ఎలా..
సీపీఎల్ టోర్నమెంట్ మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత ఉపఖండంలో మాత్రమే కాకుండా.. 100 దేశాల్లో ఈ మ్యాచులు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లల్లో ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 60 దేశాల్లో ట్విట్టర్, ఫేస్‌బుక్, యుట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా తిలకించడానికి వీలు కల్పించినట్లు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు.

మిగిలిన దేశాల్లో..
భారత్‌లో స్టార్ స్పోర్ట్స్/ఫ్యాన్ కోడ్ లైవ్ టెలికాస్ట్ చేయనుండగా.. బ్రిటన్‌లో బీటీ స్పోర్ట్, పాన్ కరేబియన్‌లో స్పోర్ట్స్ మ్యాక్స్, ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్, ట్రినిడాడ్-సీఎన్‌సీ 3, అమెరికా, కెనడాల్లో విల్లో, దక్షిణాఫ్రికాలో సూపర్ స్పోర్ట్, న్యూజిలాండ్‌లో స్కై స్పోర్ట్స్ ద్వారా ఆయా దేశాల క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లను తిలకించవచ్చు.
న్యూజీలాండ్‌కు చెందిన డానీ మోరిసన్, సైమన్ డౌల్, వెస్టిండీస్‌కే చెందిన ఇయాన్ బిషప్, శామ్యుల్ బద్రీ, డారెన్ గంగా, అలెక్స్ జోర్డాన్ వంటి మేటి మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు. కాగా- కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కొన్నిరకాల ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే ప్రవేశాన్ని కల్పించింది.

వచ్చేనెలలోనే ఐపీఎల్..
కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఐపీఎల్ మొదలవుతుంది. ఈ సాయంత్రం ప్రారంభం కాబోతోన్న సీపీఎల్ వచ్చేనెల ముగుస్తుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నాలుగో రోజు అంటే 19వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచ్‌లు కనువిందు చేస్తాయి.
ఈ మ్యాచ్‌లన్నీ అబుధాబి, షార్జా, దుబాయ్ ఇంటర్నేనల్ స్టేడియం వేదికగా సాగుతాయి. గత ఏడాది కూడా ఈ మూడు స్టేడియాల్లో టోర్నమెంట్ మొత్తం పూర్తయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున.. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ అరబ్ ఎమిరేట్స్‌కు తరలించారు నిర్వాహకులు.


Click it and Unblock the Notifications












