For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైడ్ ఇవ్వని అంపైర్.. అసహనం వ్యక్తం చేసిన కీరన్ పొలార్డ్! అలా నడుచుకుంటూ వెళ్లి (వీడియో)!!

CPL 2021: Kieron Pollard Gets Anger On Umpire And Walks Away Video Goes Viral
Wide రచ్చ Pollard Thaggede Le.. రోజురోజుకు ఎక్కువవుతున్న Umpire తప్పిదాలు || Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ ఆటలో తరచూ ఏదో ఓ ఘటన జరుగుతూనే ఉంటుంది. బ్యాట్స్‌మన్‌ భారీ సిక్సులు కొట్టడమో లేదా రికార్డులు నెలకొల్పడమో జరుగుతుంది. బౌలర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం.. ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్ పెట్టడం మనం తరచూ చూస్తుంటాం. ఇక అంపైర్ తప్పుడు నిర్ణయాలు ప్రకటించడమూ చూసుంటాం. కాకపోతే అవి ఎల్బీ, రనౌట్ విషయంలో జరుగుతుంటుంది. వైడ్ విషయంలో అంపైర్లు దాదాపు సరైన నిర్ణయమే తీసుకుంటారు. కానీ కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021లో మాత్రం కళ్లెదుటే భారీ వైడ్ వెళ్లినా.. ఫీల్డ్ అంపైర్ సరైన బంతిగా ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే...

అలా నడుచుకుంటూ వెళ్లి

సెయింట్ కిట్స్ వేదికగా మంగళవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ ఓడిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్, టీమ్ సీఫెర్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదవ బంతిని పాకిస్తాన్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా.. సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు.

పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన బంతిని సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. బంతి అందలేదు. వైడ్ లైన్‌కు బంతి దూరంగా వెళ్లినా.. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీంతో ఇది వైడ్ కాదా అంటూ సీఫెర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ కీరన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. వికెట్లకు దూరంగా నడుచుకుంటూ వెళ్లిన పొలార్డ్ తన నిరసన వ్యక్తం చేశాడు.

వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలి

వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలి

అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అంపైర్ నిగెల్ డుగుయిడ్ నిర్ణయం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆపై వాహబ్ రియాజ్ చివరి బంతి వేయడంతో ఆ ఓవర్ ముగిసింది. కీరన్ పొలార్డ్ అసహనంకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఠాకూర్ అనే క్రికెట్ అభిమాని ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీడియో చూసిన ఫాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'అంపైర్ తప్పిదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని' ఇంకొకరు ట్వీటారు. మొత్తానికి ఫాన్స్ అంపైర్లపై మండిపడుతున్నారు.

ఇదే మొదటిసారి కాదు

ఇదే మొదటిసారి కాదు

మైదానంలో ఇలా కీరన్ పొలార్డ్‌ తన నిరసన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కి ఆడే పొలార్డ్‌ ఓసారి బెంగళూరు ఆటగాడు క్రిస్‌ గేల్‌తో గొడవపడితే అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోటికి ప్లాస్టర్ వేసుకుని మైదానంలోకి దిగిన పొలార్డ్ తన నిరసనని తెలియజేశాడు.

2019 ఐపీఎల్ టైమ్‌లోనూ ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. తర్వాత బంతి కోసం వికెట్లని విడిచి వైడ్‌ లైన్‌పైకి వెళ్లి మరీ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంపైర్ల తప్పిదాల కారణంగా పొలార్డ్ గొడవపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఫ్లెచర్ పోరాడినా

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్‌ (41: 29 బంతుల్లో 6x4, 1x6), టీమ్ సీఫెర్ట్ (37: 25 బంతుల్లో 4x4, 2x6) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆండ్రీ ఫ్లెచర్ (81: 55 బంతుల్లో 6x4, 4x6) ఒంటరి పోరాటం చేశాడు. రవి రాంపాల్ మూడు వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, September 1, 2021, 11:55 [IST]
Other articles published on Sep 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+