Kieron Pollard: టీ20 క్రికెట్‌లో కీరన్ పొలార్డ్ అరుదైన మైలురాయి.. విరాట్ కోహ్లీది ఐదో స్థానం!!

సెయింట్ కిట్స్: టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో పోలార్డ్ 11వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. దాంతో టీ20 క్రికెట్‌లో 11వేల పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్‌మెన్‌గా పోలార్డ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో 554 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్ 11,008 పరుగులు చేశాడు.

11008 రన్స్:
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో కలుపుకొని) చేసిన బ్యాట్స్‌మన్ మాత్రం 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్. గేల్ పొట్టి ఫార్మాట్‌లో 14108 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కీరన్ పోలార్డ్ 11008 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 10741 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10017 పరుగులతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 9922 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 క్రికెట్‌లో 297 వికెట్లు:
కీరన్ పోలార్డ్ వెస్టిండీస్ తరఫున 119 వన్డేల్లో 2633 పరుగులు, 54 వికెట్లు పడగొట్టాడు. 88 టీ20ల్లో 1378 రన్స్, 38 వికెట్లు తీశాడు. ఇక 171 ఐపీఎల్ మ్యాచులలో 3191 రన్స్, 63 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పోలార్డ్ ఇప్పటివరకు 554 టీ20లు (అంతర్జాతీయ, ప్రపంచ వ్యాప్తంగా అన్ని లీగ్‌లు కలుపుకొని) ఆడాడు. 11008 పరుగులు చేశాడు. అలాగే టీ20 క్రికెట్‌లో 297 వికెట్లు కూడా తన పేరుతో లిఖించుకున్నాడు. దీంతో టీ20 చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరుగాంచాడు. పోలార్డ్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ (బెంగళూరు), కీరన్ పొలార్డ్‌లు మాత్రమే టోర్నెమెంట్ అసాంతం ఒకే ఫ్రాంచైజ్ తరపున ఆడుతున్నారు.

191 స్ట్రైక్ రేట్‌తో:
కీరన్ పొలార్డ్ ఇప్పటివరకు 171 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు ఆడాడు. 150.87 స్ట్రైక్ రేట్‌తో 3191 పరుగులు సాధించాడు. ఇందులో 63 మంది బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ చేర్చాడు. పొలార్డ్ 2020 సీజన్‌లో విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టులో కీలకంగా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 191 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. ఆ ఏడాది ముంబై కప్ కొట్టింది. సీపీఎల్ 2021లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. రైడర్స్ రెండు గేమ్‌లు గెలిచారు.

పొలార్డ్ నిరసన:
సెయింట్ కిట్స్ వేదికగా మంగళవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ ఓడిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. కీరన్ పొలార్డ్, టీమ్ సీఫెర్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదవ బంతిని పాకిస్తాన్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా.. సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన బంతిని సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. బంతి అందలేదు. వైడ్ లైన్‌కు బంతి దూరంగా వెళ్లినా.. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీంతో ఇది వైడ్ కాదా అంటూ సీఫెర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ కీరన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. వికెట్లకు దూరంగా నడుచుకుంటూ వెళ్లిన పొలార్డ్ తన నిరసన వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications