న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2021 Final: డ్వేన్ బ్రావో సరికొత్త రికార్డు.. టీ20ల్లో రెండో క్రికెటర్‌గా!!

CPL 2021 Final: Dwayne Bravo becomes second player to play 500 T20 matches

గయానా: వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావో టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్​లో 500 మ్యాచ్​లాడిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. బుధవారం రాత్రి బాసెటెరెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021 ఫైనల్ ద్వారా బ్రావో ఈ రికార్డు అందుకున్నాడు. సీపీఎల్​ ఫైనల్​లో సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ జట్టుకు కెప్టెన్సీ వహించిన బ్రావో.. ఈ మార్క్​ను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో బ్రావో 11 బంతులు ఆడి 8 పరుగులు చేశాడు. సీపీఎల్ టోర్నీలో కొత్త చాంపియన్‌గా సెంట్‌ కిట్స్‌ అవతరించింది.

2006లో టీ20 అరంగేట్రం చేసిన వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావో.. విండీస్ తరఫున మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగ్గుతున్న పలు లీగ్​ల్లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్​కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, చిట్టగాంగ్ కింగ్స్, లాహోర్ కలందర్స్, మెల్​బోర్న్ రెనెగేడ్స్, మెల్​బోర్న్ స్టార్స్, పార్ల్ రాక్స్, ట్రిన్​డాడ్ అండ్ టొబాగో, సిడ్నీ సిక్సర్స్, సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ తదితర జట్లలో టీ20 మ్యాచ్​లు ఆడాడు. ఇక విండీస్ తరఫున 86 టీ20లు ఆడాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో 500 మ్యాచులు పూర్తిచేశాడు.

37 ఏళ్ల డ్వేన్ బ్రావో 500 టీ20 మ్యాచ్​ల్లో 6566 పరుగులు చేశాడు. అదే సమయంలో 540 వికెట్లు తీశాడు. అత్యధిక స్కోరు 70 కాగా.. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 23/5. ఐపీఎల్​లో చెన్నై సూపర్ ​కింగ్స్​కు ఆడుతున్న బ్రావో.. త్వరలో యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొంటాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 144 మ్యాచ్​లాడి 1510 పరుగులు చేయడం సహ 156 వికెట్లు పడగొట్టాడు. టీ20 స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్న డ్వేన్ బ్రావో.. విండీస్ తరఫున 2010లో చివరగా టెస్టు మ్యాచ్, 2017లో చివరగా వన్డే ఆడటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. బ్రావో విండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు ఆడాడు.

T20 World Cup 2021: ఆ మ్యాచ్ గుర్తుందిగా.. టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ పేసర్!!T20 World Cup 2021: ఆ మ్యాచ్ గుర్తుందిగా.. టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ పేసర్!!

టీ20ల్లో అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు. కిరోన్ పొలార్డ్ 561 మ్యాచ్‌లతో 11159 పరుగులు మరియు 298 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో డ్వేన్ బ్రావో ఉన్నాడు. ఈ జాబితాలో మూడవ స్థానంలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 445 మ్యాచ్‌లలో 14261 పరుగులు, 82 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 436 మ్యాచులలో 10808 పరుగులు మరియు 152 వికెట్లతో టాప్ -5లో నిలిచాడు.

సీపీఎల్‌ 2021 విజేతగా సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ నిలిచింది. ఫైనల్ మ్యాచులో సెయింట్ లూసియా కింగ్స్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన ఫైనల్ మ్యాచులో డొమినిక్ డ్రేక్స్ (24 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరంగం సృష్టించాడు. చివరి బంతికి సింగల్ తీసి సెంట్‌ కిట్స్‌ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫ్యాబియన్ అలెన్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా చివరలో బ్యాట్ జులిపించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' డొమినిక్ డ్రేక్స్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' రోస్టన్ ఛేజ్ దక్కించుకున్నారు.

Story first published: Thursday, September 16, 2021, 11:32 [IST]
Other articles published on Sep 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X