For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీపీఎల్‌కు వేళాయె.. రాత్రి 7:30కు తొలి మ్యాచ్!!

CPL 2020, TTKR vs GUY: Dream11 Team Prediction, Team Details And Weather Report

ట్రినిడాడ్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు ఈరోజు నుంచి ధనాధన్‌ వినోదం లభించనుంది. ట్రినిడాడ్‌ మరియు టొబాగో వేదికగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) మంగళవారం ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టు తలపడనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టోర్నీలోని మొత్తం 33 మ్యాచ్‌లను పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియం, క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానాల్లో నిర్వహిస్తారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30కు తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విండీస్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. కీరన్‌ పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్. డ్వేన్‌ బ్రావో, డారెన్‌ బ్రావో, సునీల్‌ నరైన్, లెండిల్‌ సిమన్స్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ముంబైకి చెందిన 48 ఏళ్ల ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు.

గయాన అమెజాన్ వారియర్స్ జట్టులో బ్రాండన్ కింగ్, రాస్ టేలర్, షిమ్రన్ హెట్‌మైర్, నికోలస్ పూరన్, కీమో పాల్, ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే రెండు జట్లు బ్యాటింగ్ విభాగాన్నే నమ్ముకున్నాయి. మరి ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. లారా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. పరుగుల పారే అవకాశం ఉంది. మ్యాచుకు వర్షం ముప్పు లేదు.

ఇక రెండో మ్యాచ్ బార్బడోస్ ట్రైడెంట్స్ మరియు సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ విండీస్ కాలమానం ప్రకారం సాయంకాలం 5:30కు ప్రారంభమవుతుంది. అదే భారత్‌లో మరుసటి రోజు (బుధవారం) ఉదయం 3 గంటలకు మొదలవుతుంది. సీపీఎల్ 2020 మ్యాచులు అన్ని స్టార్ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్టార్‌ స్పోర్ట్స్‌-1, స్టార్‌ స్పోర్ట్స్‌-2 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. టోర్నీ మొత్తం బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తారు.

జట్లు అంచనా:

ట్రినిబాగో నైట్ రైడర్స్: కీరన్ పోలార్డ్(కెప్టెన్), లెండీ సిమ్మన్స్, కొలిన్ మున్రో, డారేన్ బ్రేవో, టిమ్ సీఫర్ట్(కీపర్), డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, ఖారీ పిర్రే, జైడేన్ సీలెస్, ప్రవీణ్ తాంబే, అండర్సన్ ఫిలిప్.

గయాన అమెజాన్ వారియర్స్: క్రిస్ గ్రీన్(కెప్టెన్), బ్రాండన్ కింగ్, చందర్ పాల్ హేమరాజ్, రాస్ టేలర్, షిమ్రన్ హెట్‌మైర్, నికోలస్ పూరన్(కీపర్), ఒడేన్ స్మిత్, కీమో పాల్, ష్రెఫెన్ రూథర్‌ఫర్డ్, ఇమ్రాన్ తాహిర్, రొమారియో షెఫర్డ్.

Story first published: Tuesday, August 18, 2020, 16:21 [IST]
Other articles published on Aug 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+