Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్.. ఐదు మార్పులతో బరిలోకి!!

amid ongoing border dispute: China has never recognised Arunachal Pradesh, Beijing provokes India

తారౌబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు రెండు సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, జమైకా తల్లావాస్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ట్రిన్‌బాగో కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పోలార్డ్ ఏకంగా ఐదు మార్పులు చేశాడు.నరైన్, సిమన్స్, బ్రావో జట్టులోకి వచ్చారు. మరోవైపు తల్లావాస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ ఒక మార్పు చేశాడు. ఆసిఫ్ అలీ బదులు న్క్రుమా బోన్నర్ ఆడనున్నాడు.

'ఇది కొత్త పిచ్. ఇక్కడ క్రికెట్ ఆడలేదు. ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటున్నా. అందుకే మొదటగా బౌలింగ్ ఎంచుకున్నా. తల్లావాస్ జట్టులో మంచి ఫినిషేర్లు ఉన్నారు. వారిని కట్టడిచేయడానికి ప్రయత్నిస్తాం. కీలక మ్యాచ్ కాబట్టి ఐదు మార్పులు చేసాం. నరైన్, సిమన్స్, బ్రావో జట్టులోకి వచ్చారు. నరైన్ మాకు చాలా కీలకం. గెలుస్తామనే నమ్మకం ఉంది' అని ట్రిన్‌బాగో కెప్టెన్ కీరన్ పోలార్డ్ అన్నాడు.

'మేము కొన్ని మ్యాచులు సరిగా ఆడలేదు. ఈ రోజు మాత్రం బాగా ఆడాలని ప్రణాళికలు రచించాం. ఆసిఫ్ అలీ బదులు న్క్రుమా బోన్నర్ ఆడనున్నాడు. మా వెనుక బలమైన సహాయక సిబ్బంది ఉన్నారు. వారు మాక్ పెద్ద బలం' అని తల్లావాస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ తెలిపాడు. 'పిచ్‌పై పచ్చిక బాగుంది. 'పేస్ బౌలింగ్‌కు అనుకూలం. అలానే బ్యాట్స్‌మన్‌ కూడా పరుగులు చెయ్యగలరు' అని పిచ్ రిపోర్టర్ డానీ మోరిసన్ అన్నాడు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.

Teams (Playing XI):
Jamaica Tallawahs: Jermaine Blackwood, Glenn Phillips(w), Asif Ali, Rovman Powell(c), Andre Russell, Carlos Brathwaite, Nkrumah Bonner, Veerasammy Permaul, Mujeeb Ur Rahman, Sandeep Lamichhane, Fidel Edwards.

Trinbago Knight Riders: Lendl Simmons, Sunil Narine, Tion Webster, Tim Seifert(w), Darren Bravo, Kieron Pollard(c), Dwayne Bravo, Akeal Hosein, Khary Pierre, Fawad Ahmed, Ali Khan.

Story first published: Tuesday, September 8, 2020, 20:09 [IST]
Other articles published on Sep 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+