For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సెయింట్ లూసియా జూక్స్!!

CPL 2020: St Lucia Zouks have won the toss and have opted to field

ట్రినిడాడ్: వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. టాస్ గెలిచిన సెయింట్ లూసియా కాపీరైన్ డారెన్ సామీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సామీ పలు మార్పులు చేశాడు. విండీస్ భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్‌కు విశ్రాంతిని ఇచ్చారు. మరోవైపు ట్రిన్‌బాగో కెప్టెన్ కీరన్ పోలార్డ్ కూడా రెండు మార్పులు చేశాడు.

'మేము ఇంకా సెమీస్ కోసం శ్రమిస్తున్నాం. ఈ మ్యాచ్ గెలవాలి. అయితే సెమీస్‌కు అర్హత సాధించడం మంచి విషయమే. ఇక స్వేచ్ఛగా ఆడతాం' అని సెయింట్ లూసియా జూక్స్ సారథి డారెన్ సామీ అన్నాడు. జూక్స్ జట్టు ఆడిన 8 మ్యాచులలో 5 విజయాలను అందుకుంది. 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తే.. అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.

'మాకు ప్రతి మ్యాచ్ ముఖ్యం. మేము ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాం. అందుకోసం ప్రణాళికలు రచించాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మాకు ఫస్ట్ క్లాస్ అనుభవం బాగుంది. టీ20 ఆడగల ఆటగాళ్లు చాలామంది ఉన్నారు' అని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ చెప్పాడు. ట్రిన్‌బాగో జట్టు ఆడిన 8 మ్యాచుల్లో 8 గెలుచుకుని.. 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ట్రిన్‌బాగో 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 36 రన్స్ చేసింది.

Trinbago Knight Riders:
Lendl Simmons, Tion Webster, Darren Bravo, Tim Seifert (wk), Sikandar Raza, Kieron Pollard (c), Dwayne Bravo, Akeal Hosein, Khary Pierre, Fawad Ahmed, Jayden Seales.

St Lucia Zouks:
Kimani Melius, Mark Deyal, Andre Fletcher (wk), Roston Chase, Najibullah Zadran, Mohammad Nabi, Leniko Boucher, Daren Sammy (c), Scott Kuggeleijn, Kesrick Williams, Zahir Khan.

Story first published: Saturday, September 5, 2020, 20:15 [IST]
Other articles published on Sep 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+