
తరోబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 సీజన్లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్లు మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన సెయింట్ కిట్స్ కెప్టెన్ రేయాద్ ఎమిరిట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సెయింట్ కిట్స్ మూడు మార్పులు చేసింది. పాక్ పేసర్ సోహైల్ తన్వీర్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. మరోవైపు సెయింట్ లూసియా గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతోంది.
'ఇది కొత్త వికెట్. చాలా తేమ ఉంది కాబట్టి మేం దాన్ని ఉపయోగించుకోవాలి. మ్యాచ్ అన్నాక ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. అది సహజమే. అయితే టోర్నీలో ఇప్పటివరకు మేము ఒక యూనిట్‌గా బాగా బ్యాటింగ్ చేయలేదు. ఈ రోజు ఆ సమస్యను అధిగమిస్తే.. మేము ఖచ్చితంగా గెలవగలం' అని టాస్ సమయంలో ఎమిరిట్ అన్నాడు. 'ఇప్పటివరకు నేను టాస్ గెలవలేదు. వికెట్ మీద కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి తెలివిగా బ్యాటింగ్ చేయాలి. మా ఓపెనర్లు మంచి ఆరంభం ఇస్తే 165 స్కోరును చేయవచ్చు. పరుగులు చేయడం చాలా కీలకం. టీ20 ఫార్మాట్ కాబట్టి బౌలింగ్బాగా చేయాలి' అని డారెన్ సామీ పేర్కొన్నాడు.
ఇప్పటివరకు లీగ్‌లోని ఆరు జట్లు రెండు మ్యాచులు ఆడాయి. కానీ ఇప్పటివరకు సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టు మాత్రమే ఒకా విజయాన్ని నమోదు చేయలేదు. సెయింట్ కిట్స్ తమ ప్రారంభ మ్యాచులో ట్రైడెంట్స్‌తో ఆపై వారియర్స్ చేతిలో ఓడిపోయింది. లిన్, లూయిస్ మరియు రామ్‌దిన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. సెయింట్ కిట్స్ విజయాన్ని అందుకోలేకపోతోంది. ఈ మ్యాచుకు వర్ష సూచన లేదు. బ్రియాన్ లారా పిచ్ .బ్యాట్స్‌మన్‌కు అనుకూలం.
Teams:
St Kitts and Nevis Patriots: Chris Lynn, Evin Lewis, Joshua Da Silva, Ben Dunk, Kieran Powell, Denesh Ramdin(w), Sohail Tanvir, Rayad Emrit(c), Ish Sodhi, Jon-Russ Jaggesar, Sheldon Cottrell.
St Lucia Zouks: Rahkeem Cornwall, Andre Fletcher(w), Najibullah Zadran, Mohammad Nabi, Daren Sammy(c), Mark Deyal, Roston Chase, Scott Kuggeleijn, Kesrick Williams, Obed McCoy, Saad Bin Zafar.