For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: రషీద్ ఖాన్ ఖాతాలో అరుదైన రికార్డు!!

CPL 2020: Rashid Khan Becomes Fastest Bowler To Complete 300 T20 Wickets

ట్రినిడాడ్: ఆఫ్ఘానిస్తాన్ యువ సంచలనం, టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్.. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. విండీస్ గడ్డపై జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)‌లో రషీద్ ఖాన్ అదరగొడుతున్నాడు. బ్యాట్, బంతితో రాణిస్తున్నాడు. సీపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్లు తలపడ్డాయి. ట్రైడెంట్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్. 300వ టీ20 వికెట్ తీశాడు.

 టీ20ల్లో 300 వికెట్లు:

టీ20ల్లో 300 వికెట్లు:

విండీస్‌ భారీకాయుడు, బాహుబలి రకీమ్‌ కార్న్‌వాల్ (14) వికెట్ తీయడం ద్వారా రషీద్ ఖాన్ ఖాతాలో 300వ వికెట్ చేరింది. దీంతో రషీద్.. టీ20 క్రికెట్లో 300 వికెట్లు సాధించిన అతి పిన్న వయస్కుడిగా మరియు అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. అతడు కేవలం 213 మ్యాచ్‌ల్లోనే 300 వికెట్లు తీశాడు. అయితే ఈ 300 వికెట్లు కేవలం అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రమే కాకుండా.. వివిధ దేశాల్లో ఆడుతున్న పలు లీగ్‌లలో కలిపి పడగొట్టాడు.

తొలి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌గా:

తొలి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌గా:

టీ20ల్లో 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో అగ్రస్థానంలో ఉన్నాడు. బ్రావో 499 వికెట్లు పడగొట్టాడు. లసిత్ మలింగ (390), సునీల్ నరైన్ (382), ఇమ్రాన్ తాహీర్ (369), షకీబ్ అల్ హాసన్ (354)లు టాప్-5లో ఉన్నారు. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్లు సోహైల్ తన్వీర్ (353), షాహిద్ అఫ్రిదీ (339) ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రషీద్ ఖాన్ 300 వికెట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అయితే టీ20 కెరీర్‌లో 300 వికెట్లు తీసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌గా రషీద్ నిలిచాడు. రషీద్ 21 సంవత్సరాల 335 రోజుల వయస్సులో 300 టీ20 వికెట్లు తీస్తే.. నరైన్ 29 ఏళ్లకు పైగా వయస్సులో ఆ ఘనత సాధించాడు.

 ఐపీఎల్‌లో భారీ అంచనాలు:

ఐపీఎల్‌లో భారీ అంచనాలు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2016లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగ్గుతుంది. అయితే ఐపీఎల్లో అన్ని జట్ల కంటే బౌలింగ్ బలంగా ఉన్న జట్టు ఏది అంటే.. సన్‌రైజర్స్ ముందు వరుసలో ఉంటుంది. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్,మొహమ్మద్ నబీ, సిద్దార్థ్ కౌల్. బాసిల్ తంపి, మిచెల్ మార్ష్, బిల్లీ స్టాన్లేక్, సందీప్ శర్మ లు ఉన్నారు. అందులో రషీద్ ఖాన్ ముఖ్యమైన ఆటగాడు. ఈ యువ ఆటగాడు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే రికార్డు సాధించాడు. దీంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైడెంట్స్ ఓటమి:

ట్రైడెంట్స్ ఓటమి:

గురువారం తరోబా వేదికగా బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా పలుమార్లు నిలిచిపోయింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బార్బడోస్‌పై సెయింట్‌ లూసియా విజయం సాధించింది. సెయింట్‌ లూసియా విజయలక్ష్యం 5 ఓవర్లలో 47 పరుగులుగా నిర్ధారించగా.. మరో ఐదు బంతులు మిగులుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇందులో రెండు వికెట్లు రషీద్ తీశాడు. కార్న్‌వాల్ (14), మహ్మద్ నబీ (15) లను ఔట్ చేశాడు.

అతడు జట్టులో ఉండిఉంటే.. భారత్ ప్రపంచకప్‌ గెలిచేది: రైనా

Story first published: Saturday, August 22, 2020, 19:13 [IST]
Other articles published on Aug 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+