For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Nicholas Pooran: 10 సిక్స్‌లతో పూరన్‌ వీరవిహారం.. 45 బంతుల్లోనే సెంచరీ!!

CPL 2020: Nicholas Pooran smashed 3 consecutive sixes to finish the match and complete his hundred

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 అభిమానులకు అసలైన టీ20 మజాను అందిస్తోంది. కరోనా కారణంగా నాలుగు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్.. ఇంగ్లండ్‌లో ప్రారంభమయినా మెరుపులు, ఉత్కంఠలు లేకపోయాయి. అయితే ఈనెల 18న ప్రారంభమయిన సీపీఎల్ 2020లో మాత్రం బ్యాట్స్‌మన్‌, బౌలర్లు చెలరేగుతున్నారు. లో స్కోరింగ్ మ్యాచులో బౌలర్లు సత్తాచాటితే.. కీలక సమయంలో బ్యాట్స్‌మన్‌ ఆటాడుకుంటున్నారు.

తొలి సెంచరీ:

తొలి సెంచరీ:

శనివారం జరిగిన మ్యాచులో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ 9 సిక్స్‌లతో విధ్వసం సృష్టించగా.. ఆదివారం గయానా అమెజాన్‌ వారియర్స్‌ వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ 10 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియోట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పూరన్‌.. 45 బంతుల్లో 10 సిక్స్‌లు, 4 ఫోర్లతో సెంచరీ బాదాడు. దీంతో గయానా సునాయాస విజయాన్ని అందుకుంది. టీ20ల్లో పూరన్‌కు ఇదే తొలి శతకం. అంతేకాదు సీపీఎల్ 2020లో కూడా నమోదైన తొలి సెంచరీ కూడా ఇదే.

డా సిల్వా హాఫ్‌ సెంచరీ:

డా సిల్వా హాఫ్‌ సెంచరీ:

మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గయానా అమెజాన్‌ వారియర్స్..‌ సెయింట్‌ కిట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్‌ కిట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (15), కె పావెల్ (2) విఫలమయ్యారు. ఈ సమయంలో జోషువా డా సిల్వా జట్టును ఆదుకున్నాడు. బెన్ డంక్ (19), దినేష్ రాందిన్ (37) సహకారంతో డా సిల్వా (59) హాఫ్‌ సెంచరీ సాధించాడు. డా సిల్వా అనంతరం రాందిన్ ఒంటరి పోరాటం చేసి జట్టును గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. గయానా బౌలర్ క్రిస్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టాడు.

ఆదిలో గయానాకు భారీ షాక్:

ఆదిలో గయానాకు భారీ షాక్:

లక్ష్య ఛేదనలో గయానాకు భారీ షాక్ తగిలింది. 24 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (14), కెవిన్ సింక్లైర్ (5) పెవిలియన్ చేరారు. జగ్గేసర్ దాటికి విండీస్ స్టార్ ఆటగాడు షిమ్రాన్ హెట్మియర్ (1) కూడా విఫలమయ్యాడు. దీంతో 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన గయానా కష్టాలో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన నికోలస్‌ పూరన్‌ తొలుత ఆచితూచి ఆడాడు. పిచ్‌పై పట్టుదొరికిన తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

హ్యాట్రిక్‌ సిక్స్‌లతో సెంచరీ:

హ్యాట్రిక్‌ సిక్స్‌లతో సెంచరీ:

క్రీజ్‌లో కుదురుకున్న నికోలస్‌ పూరన్ ఓవర్‌కు సిక్స్‌ కొట్టాలన్న కసితో బ్యాట్‌ ఝుళిపించాడు. అతనికి రాస్ టేలర్ (25) అండగా నిలిచాడు. టేలర్ నెమ్మదిగా ఆడినా.. పూరన్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పూరన్‌.. 45 బంతుల్లో 10 సిక్స్‌లు, 4 ఫోర్లతో శతకం సాధించాడు. సెయింట్‌ కిట్స్‌ బౌలర్‌ ఇష్‌ సోథీ వేసిన 18 ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. జట్టు విజయానికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్స్‌ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. దాంతో గయానా 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇది టీ20ల్లో పూరన్‌కు తొలి శతకం.

Story first published: Monday, August 31, 2020, 12:27 [IST]
Other articles published on Aug 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+