5 సార్లు ఫైన‌ల్‌కు చేరినా కప్ గెలవలేదు.. గ‌యానా జ‌ట్టును వెంటాడుతున్న దుర‌దృష్టం!!

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్​, టొబాగోలో ఈ సీజన్ మ్యాచులు జరుగనున్నాయి. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సీపీఎల్ టీ20 8వ ఎడిష‌న్ జ‌ర‌గ‌నుంది. ఇందులో విండీస్‌తోపాటు ఇత‌ర దేశాల నుంచి ప‌లువురు ప్లేయ‌ర్లు కూడా పాల్గొంటున్నారు. మొత్తం 6 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

ప్రాంచైజీల్లో ఒక‌టైన గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన సీపీఎల్ టోర్నీల్లో స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగిస్తూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు విజేత‌గా నిల‌వ‌లేదు. మొత్తం 5 సార్లు ఫైన‌ల్‌కు చేరినా.. ట్రోఫీని ముద్దాడలేకపోయింది. సీపీఎల్ టీ20లో గయానా అమెజాన్ వారియ‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 78 మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో 50 మ్యాచ్‌ల‌లో విజయం సాధించింది. సీపీఎల్ టీ20లో 2019లో జ‌మైకాపై 6 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. అదే ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌యానా సాధించిన భారీ స్కోరు. ఇక టోర్నీలో 2016లో జ‌మైకా చేతిలో 93 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇది గ‌యానాకు అత్య‌ల్ప స్కోరు.

గయానా అమెజాన్ వారియ‌ర్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడిన ప్లేయ‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లెండ‌ల్ సిమ్మ‌న్స్ 1,029 ప‌రుగుల‌తో అత్య‌ధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. 2019లో బార్బ‌డోస్ జ‌ట్టుపై బ్రాండ‌న్ కింగ్ 132 ప‌రుగుల స్కోరు చేయ‌గా.. అదే ఈ జ‌ట్టుకు ఒక ప్లేయర్ సాధించిన అత్య‌ధిక స్కోరు. గ‌యానా జ‌ట్టు త‌ర‌ఫున బ్రాండ‌న్ కింగ్‌, షిమ్రాన్ హిట్‌మైర్‌లు 2 సెంచ‌రీలు సాధించారు. సీపీఎల్ టీ20 టోర్నీలో గ‌యానా జ‌ట్టు త‌ర‌ఫున ఆడి అత్య‌ధిక సిక్స్‌లు బాదిన ప్లేయ‌ర్‌గా లెండ‌ల్ సిమ్మ‌న్స్ రికార్డు సాధించాడు. అత‌ను ఈ జ‌ట్టుకు ఆడి మ్యాచ్‌ల‌లో కొట్టిన సిక్స్‌ల సంఖ్య 43. గ‌యానా జ‌ట్టు త‌ర‌ఫున 2019లో బ్రాండ‌న్ కింగ్ టోర్నీలో మొత్తం క‌లిపి అత్య‌ధికంగా 496 ప‌రుగులు సాధించాడు.

గయానా అమెజాన్ వారియ‌ర్స్ జ‌ట్టు త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు (49) తీసిన బౌల‌ర్‌గా సోహెయిల్ త‌న్వీర్ రికార్డులో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్‌, వికెట్ కీపింగ్ విభాగాల్లోనూ గ‌యానా అద్భుతంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఈ జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌లేదు. గయానాను దుర‌దృష్టం వెంటాడుతోంది. మ‌రి ఈ సారైనా గయానా ట్రోఫీని సాధిస్తుందో? లేదో?చూడాలి.

సీపీఎల్ 2020 టోర్నీ విజేతకు 1 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీ ఇస్తారు. అదే ర‌న్న‌రప్‌‌కు అయితే 6.60 ల‌క్ష‌ల డాల‌ర్లను బ‌హుమ‌తిగా ఇస్తారు. 3వ స్థానంలో నిలిచిన వారికి 2.50 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను, 4వ స్థానంలో నిలిచిన వారికి ఒక ల‌క్ష డాల‌ర్ల‌ను ఇస్తారు. ప్లేయ‌ర్ల‌కు ప్రైజ్ మ‌నీని 1.50 ల‌క్ష‌ల డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. లాంగెస్ట్ సిక్స్ కొట్టిన వారికి 5వేల డాల‌ర్లు ఇవ్వనున్నారు. టోర్నీ మొత్తం అన్ని ప్రైజ్ మ‌నీ 2.16 మిలియ‌న్ డాల‌ర్లు.

'రాహుల్‌ అద్భుతమైన వ్యక్తి.. అతని కెప్టెన్సీలో ఆడటానికి ఎదురుచూస్తున్నా'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 11, 2020, 22:25 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X