For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: సెయింట్‌ లూసియా-బార్బడోస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం!!

CPL 2020 BT vs SLZ: Match halted due to rain

తరోబా (ట్రినిడాడ్‌): వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్ మ్యాచ్‌లకు వరణుడు అడ్డుపడుతున్నాడు. మంగళవారం మొదలైన లీగ్ తొలి మ్యాచ్‌కు అడ్డుపడ్డ వరణుడు.. గురువారం కూడా ఆటంకం కలిగిస్తున్నాడు. తరోబా వేదికగా బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి మొదటగా బ్యాటింగ్ చేస్తున్న బార్బడోస్ 18.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన బార్బడోస్ ట్రైడెంట్స్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసాడు. అయితే స్కాట్ కుగ్గేలేన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతిని షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఓపెనర్ షై హోప్ 3 బౌండరీలు బాది స్కోర్ వేగం పెంచే క్రమంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం కోరే ఆండర్సన్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.

ఈ సమయంలో కైల్ మేయర్స్ అండతో కెప్టెన్ జాసన్ హోల్డర్ రెచ్చిపోయాడు. 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది ట్రైడెంట్స్ స్కోర్ బోర్డును 100కు చేశాడు. అదే ఊపులో భారీ షాట్ ఆడిన హోల్డర్ (27) కేస్రిక్ విలియమ్స్ బౌలింగ్‌లో డారెన్ సామి చేతికి చిక్కాడు. ఆ వేంటనే జోనాథన్ కార్టర్ (5), మేయర్స్ (16)ను రోస్టన్ చేజ్ ఔట్ చేయడంతో ట్రైడెంట్స్ కష్టాల్లో పడింది. రేమోన్ రీఫెర్ (1) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో అష్లే నర్స్ (16), మిచెల్ సాంట్నర్ (8) ఆడుకున్న్నారు. ఇదే సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. బార్బడోస్ 18.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో నర్స్ (16), సాంట్నర్ (8) ఉన్నారు.

St Lucia Zouks Squad:
Rahkeem Cornwall, Andre Fletcher (wk), Mark Deyal, Roston Chase, Najibullah Zadran, Mohammad Nabi, Daren Sammy (c), Scott Kuggeleijn, Kesrick Williams, Obed McCoy, Saad Bin Zafar.

Barbados Tridents Squad:
Johnson Charles, Shai Hope (wk), Corey Anderson, Kyle Mayers, Jason Holder (c), Jonathan Carter, Raymon Reifer, Mitchell Santner, Ashley Nurse, Rashid Khan, Hayden Walsh.

Story first published: Thursday, August 20, 2020, 22:40 [IST]
Other articles published on Aug 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+