న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా మూడో సారి టైటిల్ ఎగరేసుకుపోయిన నైట్ రైడర్స్

CPL 2018 : Knight Riders Crowned Champions For Third Time
 CPL 2018: Khary Pierre, Colin Munro Star As Trinbago Knight Riders Beat Guyana Amazon Warriors To Clinch Third Title

హైదరాబాద్: క్రమంగా దేశీవాలీ లీగ్‌లకు కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే క్రేజ్ పెరిగిపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఐపీఎల్ ఉత్సాహం మూడు నెలల పాటు కొనసాగింది. అలాంటిదే మరో వెస్టిండీస్ వేదికగా జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) ఆదివారంతో ముగిసింది. ఈ లీగ్‌లో ట్రిబాగో నైట్‌రైడర్స్‌ మరోసారి చాంపియన్‌గా నిలిచింది.

ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో గుయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టుపై గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెజాన్‌ వారియర్స్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ఆపై బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నైట్‌రైడర్స్‌ ఓపెనర్లు దినేశ్‌ రామ్‌దిన్‌(24), బ్రెండన్‌ మెకల్లమ్‌(39)లు మంచి ఆరంభాన్నివ్వగా, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు కొలిన్‌ మున్రో(68; 39 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్‌ చేసి జట్టు టైటిల్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.

ఈ విజయంపై నైట్‌రైడర్స్ కెప్టెన్ బ్రావో మాట్లాడతూ.. టోర్నమెంట్ మొత్తంలో మా జట్టు చూపించిన ప్రదర్శనకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఫైనల్ మ్యాచ్‌లో తొలిబంతిని వేసిన అలీ ఖాన్ ఓ శుభారంభాన్ని నమోదు చేశాడు. రోంచి మంచి ఆరంభాన్ని అందిస్తే.. పీరె అతని స్థైర్యాన్ని మరోసారి చాటాడు. కొలిన్ మన్రో .. బ్రెండన్ మెక్ కల్లమ్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు.' అని కెప్టెన్ కొనియాడాడు. అతనితో పాటుగా మరికొందరు నైట్ రైడర్స్ ఆటగాళ్లు తమ హర్షం వ్యక్తం చేశారు.

Story first published: Monday, September 17, 2018, 13:30 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X