
రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు
ప్రస్తుతం సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ఉన్న గంగూలీని పరామర్శించడానికి అశోక్ భట్టాచార్యా వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'కొన్ని పార్టీలు సౌరవ్ గంగూలీని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి. అది కచ్చితంగా గంగూలీపై ఒత్తిడి తేవడమే. దాదా పొలిటికల్ లీడర్ కాదు. అతడిని ఒక స్పోర్ట్స్ ఐకాన్‌గా మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. గంగూలీని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయవద్దు. రాజకీయాల్లో చేరకూడదని నేను సౌరవ్‌తో గత వారం చెప్పాను. అతను నా అభిప్రాయాలను వ్యతిరేకించలేదు' అని అన్నారు.

దిలీప్ ఘోష్ ఫైర్
ఎవరైనా సరే సౌరవ్ గంగూలీని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయవద్దని దాదా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అశోక్ భట్టాచార్యా హితవు పలికారు. అయితే మాజీ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందించారు. 'కొంతమంది తమ మానసిక పరిస్థితి కారణంగా.. ప్రతిదానిలో రాజకీయాలను చూస్తారు. దాదాకు ఉన్న మిలియన్ల మంది అభిమానుల మాదిరిగానే.. అతడు పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం' అని ఘాటుగా బదులిచ్చారు.

ఆ ప్రయత్నం చేయలేదు
ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని సందర్శించిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి శోభండేబ్ ఛటర్జీ మాట్లాడుతూ... 'గంగూలీని పార్టీలోకి చేర్చే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు. గంగూలీని ఒక స్పోర్ట్స్ ఐకాన్‌గా చూస్తున్నందుకు మేము గర్విస్తున్నాం' అని అన్నారు. గంగూలీ మాజీ సహచరుడు, రాష్ట్ర మంత్రి లక్ష్మి రతన్ శుక్లా.. దివంగత బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమార్తె, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మరియు పలువురు దాదాను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అందరూ దాదా త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

113 టెస్టులు, 311 వన్డేలు
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్ దాదా ఆకట్టుకున్నాడు.
డేవిడ్ మలానా 'మజాకా'.. సిక్స్ కొడితే బీర్ గ్లాస్‌లో పడింది!! ఎలాగో చూడండి (వీడియో)!


Click it and Unblock the Notifications
