For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత‌నిది పాకిస్తాన్‌..ఆమెది హిందూస్తాన్: ఆ రెండు దేశాల జెర్సీల‌తో హ‌ల్‌చ‌ల్‌!

Couple wears jersey with India, Pakistan colours, watching Match at Old trafford

మాంఛెస్ట‌ర్‌: ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య కొన‌సాగిన మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం ఒక‌టి క‌నిపించింది. అభిమానుల‌ను క‌ట్టి ప‌డేసింది. ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించ‌డానికి కెన‌డా నుంచి మాంఛెస్ట‌ర్‌కు వ‌చ్చింది ఓ జంట‌. వారిద్ద‌రు ధ‌రించిన దుస్తులు భార‌త్‌, పాకిస్తాన్ క్రికెట‌ర్ల జెర్సీల‌ను పోలి ఉన్నాయి. టీమిండియా మెన్ ఇన్ బ్లూ జెర్సీ స‌గం, పాకిస్తాన్ గ్రీన్ ఆర్మీ జెర్సీ స‌గం క‌లిపి కుట్టించిన దుస్తులు అవి. ఈ దుస్తులు ధ‌రించి వారు ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం సంద‌డి చేస్తూ క‌నిపించారు.

అత‌నిది పాకిస్తాన్‌, ఆమెది హిందూస్తాన్‌..
వారిద్ద‌రూ కెన‌డాలో స్థిర‌ప‌డిన‌ప్ప‌టికీ.. నిజానికి భార‌త్‌, పాకిస్తాన్ దేశాల నుంచి అక్క‌డికి వెళ్లారు. ఆ మ‌హిళ స్వ‌దేశం భార‌త్‌. అత‌నిది పాకిస్తాన్‌. వారిద్ద‌రూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంత‌రం ఈ రెండు దేశాల‌కు దూరంగా వెళ్లి కెన‌డాలో స్థిర‌ప‌డ్డారు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు, శ‌తృత్వం ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు దేశాల‌కు చెందిన వారిద్ద‌రూ ప్రేమ వివాహం చేసుకోవ‌డం ఆక‌ట్టుకుంది. భార‌త్, పాక్ జ‌ట్ల‌ల్లో తాము ఏ ఒక్క దానికో మ‌ద్ద‌తు ప‌ల‌క‌ట్లేద‌ని అన్నారు. ఏ జ‌ట్టు విజ‌యం సాధించినా, గెలిచేది క్రికెట్టేన‌ని అన్నారు. రెండు దేశాల మ‌ధ్య శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొనాలని తాము కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

Story first published: Monday, June 17, 2019, 16:03 [IST]
Other articles published on Jun 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+