Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆతృతగా ఎదురు చూస్తున్నా: కౌంటీ క్రికెట్‌పై అశ్విన్

County stint depends on feasibility factor, says R Ashwin

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవెన్‌కు నేతృత్వం వహించేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. ముంబైలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో భారత క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాతో కలిసి అశ్విన్‌ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ 'నా సామర్ధ్యం మేరకు పని చేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇదొక అద్భుతమైన ఛాలెంజ్‌. నేను చాలామంది ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్‌లో ఆడా. వారి వద్ద నుంచి చాలా నేను నేర్చుకుంటా. కెప్టెన్‌గా ఎంత చేయగలనో అంతా చేస్తా' అని అశ్విన్‌ చెప్పాడు.

ఐపీఎల్‌ అనేది టీ20 ఫార్మాట్ కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఒత్తిడి ఉంటుందని, ఒత్తిడిని అధిగమించి ఫలితాలు సాధించగలిగితే ఇంక అలాంటివి ఏమీ ఉండదని అన్నాడు. ఒకవేళ సాధించలేకపోతే దాని నుంచి నేర్చుకుని ముందుకు సాగాలని అశ్విన్ పేర్కొన్నాడు.

తాను మంగళవారం జట్టు సభ్యులందరినీ టీం అసెంబ్లీ పాయింట్‌ వద్ద తొలిసారి కలుసుకోబోతున్నానని.. ఒక్కసారి సభ్యులందరినీ కలిశాక ఏం చేయాలో తెలుస్తుందని అన్నాడు. తాను తొలిసారి ఈ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నానని.. జట్టు మొత్తం డైనమిక్‌గా ఎలా పనిచేయాలనే దానిపై దృష్టి పెడతామని తెలిపాడు.

ఇంగ్లాండ్‌తో త్వరలో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కంటే ముందు దేశవాళీ టోర్నీల్లో ఆడాలని ఎక్కువ మంది క్రికెటర్లకు ఆసక్తి ఉంటుందని, అయితే అది తమకున్న వెసులుబాటుపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడటంపై కూడా అశ్విన్ స్పందించాడు.

గత ఐపీఎల్ సీజన్‌కు దూరమైన అశ్విన్ ఇంగ్లాండ్ కౌంటీల్లో వర్సీస్టైర్ తరుపున ఆడిన సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ సైతం అప్ఘన్‌తో జరిగే టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత నేరుగా కోహ్లీ నేరుగా ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లాండ్‌కు పయనం కానున్నాడు. కౌంటీ క్రికెట్‌లో సర్రే జట్టు తరఫున ఆడనున్నాడు.

Story first published: Tuesday, March 27, 2018, 8:21 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+