
మార్నస్ లాబుషేన్ బౌలింగ్లో షార్ట్ డెలివరీని లెగ్ సైడ్ ఆడేక్రమంలో బంతి మిస్సయి ఇంగ్లాండ్ కొత్త టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పొత్తి కడుపును బలంగా తాకింది. దీంతో హఠాత్తుగా స్టోక్స్ కుప్పకూలాడు. దీంతో ఈ క్లిప్ వైరలైంది. స్టోక్స్ డర్హామ్ జట్టు తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ -2022లో ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో వోర్సెస్టర్‌షైర్‌పై కేవలం 88బంతుల్లో 161పరుగులు చేసిన స్టోక్స్.. తాజాగా గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. 110బంతుల్లో 82 పరుగులు చేసిన స్టోక్స్.. తన ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు మరియు రెండు సిక్సర్లు కొట్టాడు.
ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ త్వరలోనే ఆడనున్న తరుణంలో అతను ఫామ్ అందుకోవడం చాలా కీలకం. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా జో రూట్ వైదొలిగిన తర్వాత స్టోక్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్టోక్స్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్. ఇంగ్లాండ్ జట్టు టెస్టులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సంప్రదాయ క్రికెట్‌కు ఇంగ్లాండ్‌లో ఇంకా మంచి ఆదరణ ఉంది. యాషెస్ సిరీస్ వైఫల్యం తర్వాత జో రూట్ మీద ఒత్తిడి పెరగడంతో అతను కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా కౌంటీ ఛాంపియన్ షిప్ 2022లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో స్టోక్స్ 33 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనూహ్య ఘటన జరిగింది. లబూషేన్ బౌలింగ్ చేస్తుండగా.. స్టోక్స్ క్రీజులో ఉన్నాడు. లబూషేన్ షార్ట్ పిచ్ బంతి వేశాడు. అయితే అది అనుకున్నంత ఎత్తులో రాలేదు. ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేని స్టోక్స్ లెగ్ సైడ్ ఆడడానికి ట్రై చేశాడు. బంతి నడము ఎత్తులో వచ్చి బ్యాట్ కు మిస్సయి స్టోక్స్ పొత్తి కడుపు వద్ద తాకింది. దీంతో వెంటనే స్టోక్స్ పడిపోయాడు. అలాగే కాసేపు ఫ్లాట్‌గా వెల్లకిలా ఒరిగాడు. స్టోక్స్‌కు ఏమైందోనని టెన్షన్ మొదలయ్యే టైంకి అతను లేచి తాను ఆల్రైట్ అంటూ సైగ చేసి మళ్లీ తన బ్యాటింగ్ కొనసాగించాడు. ఈక్రమంలో స్టోక్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. స్టోక్స్ రాణించడంతో డర్హామ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 311పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లామర్గన్ 31పరుగులకే 2వికెట్లు కోల్పోయింది. ఇంకా ఆ జట్టు ఆధిక్యంలోకి రావాలంటే 280పరుగులు చేయాలి.