For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా పుజారా.. అద్భుతాలు చేయగలడన్న కోచ్

County Championship 2022:Pujara Will lead the Sussex, Coach Announced He is Interim Captain for Team

కౌంటీ ఛాంపియన్ షిప్ : గత వారం లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ కెప్టెన్ టామ్ హైన్స్ చేతిలో ఎముక విరిగి గాయపడడంతో అతను దాదాపు 5 నుంచి 6వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో.. మంగళవారం ఆ జట్టు స్టార్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ససెక్స్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో పుజారా 750కి పైగా పరుగులు సాధించి మంచి ఫామ్ కనబర్చాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన రన్ స్కోరర్‌లలో పుజారా ఒకడు. ఇక ఈ విషయమై ససెక్స్ జట్టు ప్రధాన కోచ్ ఇయాన్ సాలిస్‌బరీ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించాడు.

'టామ్ దూరమైనందున పుజారా లాంటి ఇంట్రెస్టెడ్ ప్లేయర్ కెప్టెన్‌గా అన్ని విధాలా అర్హుడు. అతను కెప్టెన్సీలో తన సామర్థ్యాన్ని చూపించగలడని, అతను ఓ నేచురల్ కెప్టెన్ అని పేర్కొన్నాడు.' ఇటీవల ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో తిరిగి షెడ్యూల్ చేసిన అయిదో టెస్టు కోసం పుజారా భారత తుది జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. తద్వారా ససెక్స్ జట్టుకు కొన్ని రోజులుగా పుజారా దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు.

'ఇక ససెక్స్ కెప్టెన్ టామ్ గాయపడిన తర్వాత ఫిన్నీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. అతను మా టీం బౌలర్లలో ఓ సీనియర్ ప్లేయర్. అయితే ఒక బ్యాటర్ కెప్టెన్ పాత్రను పోషిస్తే.. బౌలింగ్లో ఫిన్నీ ఫోకస్ చేయడమే కాకుండా బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేయగలడని మేము ఆశిస్తున్నాం. పుజారా చాలా అనుభవం, స్కిల్ ఫుల్ ప్లేయర్. అతను కెప్టెన్సీ విషయంలోనూ అద్భుతాలు చేస్తాడని మేం అనుకుంటున్నాం. అందువల్ల పుజారాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తున్నాం' అని ససెక్స్ కోచ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో పుజారా 109.42 సగటుతో 766 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 203. ఈ సీజన్‌లో పుజారా నాలుగు సెంచరీలు చేయడం గమనార్హం.

Story first published: Tuesday, July 19, 2022, 17:51 [IST]
Other articles published on Jul 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+