Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా గుర్తొచ్చిందో ఏమో.. బ్యాట్స్‌మన్‌కు సాయం చేయకుండా వెళ్లిన బౌలర్ (వీడియో)!

County Championship 2021: Bowler Keith Barker pulls off a hilarious prank on batsman Nick Gubbins

హైదరాబాద్: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడూ కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. బ్యాట్స్‌మన్‌, బౌలర్‌, ఫీల్డర్, కీపర్ మధ్య జరిగే కొన్ని చిలిపి సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా బ్యాట్స్‌మన్‌, బౌలర్‌ మధ్య జరిగే ఘటనలు. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బౌలర్‌కు గుర్తొచ్చిందో ఏమో కానీ.. కిందపడిన బ్యాట్స్‌మన్‌కు సాయం చేయకుండా అలానే వెళ్లిపోయాడు. చేయి ఇచ్చినట్టే ఇచ్చి వెళ్లిపోవడం ఇక్కడ విశేషం.

మంగళవారం ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మిడిల్‌సెక్స్‌, హాంప్‌షేర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్‌ బ్యాట్స్‌మన్‌ నిక్‌ గుబ్బిన్స్‌ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ మధ్యలో హాంప్‌షేర్‌ బౌలర్‌ కీత్ బార్కర్ వేసిన ఓవర్లో నిక్‌ బ్యాక్‌వర్డ్‌ దిశగా షాట్‌ ఆడాడు. రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు వెళ్లిన నిక్‌ క్రీజులో జారిపడ్డాడు. ఇది గమనించిన నాన్ స్ట్రైకర్ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో మిడిల్‌సెక్స్‌ ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.

బంతి విసిరిన బౌలర్ కీత్ బార్కర్‌ వెనక్కి వస్తున్నాడు. అప్పటికే క్రీజులో కిందపడి ఉన్న నిక్‌కు హెల్ఫ్‌ చేస్తున్నట్లుగా తన హ్యాండ్‌ను అతనికి అందించబోయాడు. అది చూసిన నిక్‌ అతనికి చేయి ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో బార్కర్‌కు ఏమనిపించిందో తెలియదు కానీ.. వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిక్‌ లేచి బార్కర్‌ను అదేపనిగా చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో గ్రేడ్‌ క్రికెటర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'కరోనా గుర్తొచ్చిందో ఏమో.. అందుకే సాయం చేయకుండా వెళ్లిపోయాడు' అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో హాంప్‌షేర్‌ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన మిడిల్‌సెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత హాంప్‌షేర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులు చేసి 36 పరుగులు ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మిడిల్‌సెక్స్‌ 101 పరుగులకే ఆలౌట్ అయింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షేర్‌ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Story first published: Tuesday, May 18, 2021, 21:53 [IST]
Other articles published on May 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+