కరీనా మాట్లాడుతూ
అనంతరం ఆమె మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే ఆయా దేశాల తరుపున ఆడుతోన్న మహిళా క్రికెటర్లంతా తమ కలలను సాకారం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు.
ట్రోఫీని ఆవిష్కరించడం గౌరవం ఉంది
ఇంతటి అంతర్జాతీయ టోర్నీలో వారు పాల్గొనడం గొప్ప విషయమని, వారంతా మనకు ఆదర్శమని కరీనా కపూర్ కొనియాడారు. తన మామగారు (మన్సూర్ పటౌడీ అలీఖాన్) కూడా ప్రముఖ క్రికెటర్ అని ఈ సందర్భంగా కరీనా గుర్తు చేశారు. ట్రోఫీని ఆవిష్కరించడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు.
భారత్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో
డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్-1లో ఉన్నాయి. భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్ జట్టుతో తలపడుతుంది.
నవంబర్ 15న ఫైనల్ మ్యాచ్
క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ నిర్వహిస్తారు. మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో పాటు మరో 9 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇందులో టాప్-8 జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో మరో ఆరు జట్లతో తలపడాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications
