సిక్స్ బాదితే బ్యాట్‌తో కొడ్తానన్నాడు: సచిన్‌పై వీరూ
న్యూఢిల్లీ: 'నువ్వు మరోసారి సిక్సర్ కొడితే బ్యాట్‌తో కొడతాన'ని అన్నాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పాడు. పాకిస్థాన్‌లో ముల్తాన్ టెస్ట్ సందర్భంగా జరిగిన ఈ సంఘటనను సెహ్వాగ్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచులో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు.
ముల్తాన్ టెస్ట్‌లో సచిన్, నేను భారీ భాగస్వామ్యం నెలకొల్పామని, నాలుగో సిక్స్ కొట్టిన తర్వాత సచిన్ తన వద్దకు వచ్చి.. 'నువ్యు మరోసారి సిక్స్ కొడితే నిన్ను బ్యాట్‌తో కొడతా'నని అన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో తాను సెంచరీ పైచిలుకు స్కోరుతో ఆడుతున్నానని, మాస్టర్ సూచనలు పాటించి 295 పరుగుల వరకూ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదని చెప్పాడు.
అయితే సక్లయిన్ వస్తే మాత్రం సిక్స్ కొడతానని టెండూల్కర్‌కు చెప్పానని, ఆ తర్వాత సక్లయిన్ బౌలింగ్‌కు దిగడం భారీ సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేయడం జరిగిపోయాయని అతను చెప్పాడు. సెహ్వాగ్ ట్రిపుల్ కారణంగా ముల్తాన్ టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. అప్పటి నుంచి వీరూను 'ముల్తాన్ కా సుల్తాన్' అని ముద్దుగా పిలుస్తున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో సెహ్వాగ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా సచిన్‌తో జరిగిన ఆసక్తికర సంభాషణ సెహ్వాగ్ నెమరేసుకున్నాడు. ఆ టెస్ట్‌లో భారత స్కోరు 68/4తో ఉన్నప్పుడు సెహ్వాగ్ సచిన్‌కు భాగస్వామిగా క్రీజులోకి వచ్చాడు. తనను ఆహ్వానించిన సచిన్.. 'పొట్టలో గిలిగింతలు పెడుతోందా?' అని అడిగాడు. దానికి 'అదంతా వదిలేయండి సార్, పిచ్ ఎలా ఉంద'ని అడిగినట్టు సెహ్వాగ్ చెప్పాడు.
దానికి సచిన్ - 'సఫారీ బౌలర్లు బౌన్సర్లతో గాబరా పెట్టడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండాలని ధైర్యం చెప్పాడు. కొన్ని ఓవర్లు గడిచిన తర్వాత సచిన్ స్లిప్ ఫీల్డర్లపై నుంచి ఫోర్ కొడతానని చెప్పి మరీ పరుగులు సాధించాడు. ఆ తర్వాత నేనూ చెలరేగాను. ఇద్దరం 200 పరుగుల పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేశామని అన్నాడు.
వన్డే అరంగ్రేటం మ్యాచ్‌లో ఏం జరిగిందో తెలియకుండానే అవుటయ్యానని సెహ్వాగ్ చెప్పాడు. సెహ్వాగ్ వన్డే మ్యాచుల్లో రంగప్రవేశం 1999లో పాక్‌తో మొహాలీ మ్యాచ్‌తో జరిగింది. మొదటి వన్డేలో అతను ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. పెప్సీ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో ఏడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ క్రీజులోకి వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన సెహ్వాగ్‌ను అక్తర్ వేగవంతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 'బంతే కనబడలేదు. అక్తర్ చాలా వేగంగా వేశాడ'ని చెప్పాడు చెప్పాడు. అయితే ఆ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ఎంతో ధైర్యం చెప్పాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications