
సునామీ ఇన్నింగ్..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. కసి తీరా ఆడారు. కరవు తీరేలా షాట్లను బాది అవతల పడేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల భరతం పట్టారు. మునుపటి ఫామ్‌ను అందుకున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చిచ్చరపిడుగుల్లా ఆడారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 140 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. రోహిత్‌తో పోటీ పడి షాట్లు కొట్టాడు రాహుల్. 48 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 69 పరుగులు చేశాడు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అదే దూకుడు..
అబుధాబి గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై చూపించిన దూకుడును రోహిత్ శర్మ.. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ప్రదర్శించాడు. అభిమానులపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై ఓడిన విషయాన్ని ప్రస్తావించాడు. తొలి రెండు గేమ్‌లల్లో ఓడిపోయినంత మాత్రాన భారత జట్టును బ్యాడ్‌గా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. బ్యాడ్ ప్లేయర్స్, బ్యాడ్ టీమ్‌గా భావించవద్దని సూచించాడు. అన్ని ఫార్మట్లలోనూ చాలాకాలం నుంచీ నిలకడగా రాణిస్తున్నామని, సమష్టిగా సత్తా చాటుతున్నామని గుర్తు చేశాడు.

రవి అశ్విన్‌ను వంక పెట్టలేం..
ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. నిస్సందేహంగా క్వాలిటీ బౌలర్ అని రోహిత్ శర్మ కితాబిచ్చాడు. ఎన్నో వికెట్లను పడగొట్టిన అనుభవం అతనికి ఉందని చెప్పాడు. నాలుగు సంవత్సరాల తరువాత టీ20 మ్యాచ్‌ను ఆడుతూ.. వికెట్లను పడగొట్టడం అనేది అతనికి ఛాలెంజింగ్ అని, తనను తాను మరోసారి నిరూపించుకున్నాడని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లో అద్భుతంగా బౌల్ చేశాడని ప్రశంసించాడు. మిడిల్ ఓవర్లల్లో వికెట్లను పడగొట్టే సత్తా రవి అశ్విన్‌కు ఉందని రోహిత్ శర్మ చెప్పాడు.

వందశాతం ఎఫర్ట్స్
రవిచంద్రన్ అశ్విన్.. వికెట్లను తీయడానికి వందశాతం ఎఫర్ట్స్ పెడతాడని, వచ్చామా? బౌలింగ్ చేశామా? అనేది అతని మనస్తత్వం కాదని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. నాలుగు సంవత్సరాల తరువాత ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో 14 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లను తీయడం సాధారణ విషయం కాదని అన్నాడు. ఇక ముందు కూడా అతను ఇదే రకమైన దూకుడును కొనసాగిస్తాడనటంలో సందేహాలు అక్కర్లేదని చెప్పాడు. జట్టు అతని మీద ఎప్పటికీ నమ్మకం ఉంచుతుందని పేర్కొన్నాడు.

తొలి రెండు మ్యాచ్‌లల్లో..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి రెండు మ్యాచ్‌లల్లో ఇదే రకమైన ఫలితం వచ్చి ఉంటే బాగుండేదని, అయినప్పటికీ నిరుత్సాహ పడాల్సిన పని లేదని అన్నాడు. సెమీ ఫైనల్స్‌కు చేరడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడాయని, తాము వాటితో తీసిపోలేదని వ్యాఖ్యానించాడు. ఈ రెండు మ్యాచ్‌లల్లో స్వేచ్ఛగా ఆడలేక పోయామని, ఇప్పుడు దాన్ని సాధించామని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఎప్పటికీ డిపెండబుల్ బ్యాటరేనని, ఈ విషయాన్ని అతను చాలాసార్లు నిరూపించాడని చెప్పాడు.


Click it and Unblock the Notifications












