ఒక జత బూట్లు, ఒక జత టీ షర్టుల నుంచి ప్రధాన పేసర్‌గా బుమ్రా జీవితం (వీడియో)

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎలా మారాడో తెలుపుతూ బుధవారం ముంబై ఇండియన్స్ జట్టు ఓ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లండన్‌లో సోమవారం స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్ జరిగింది.

బుమ్రాపై ప్రశంసల వర్షం
ఈ స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబాని బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించింది. "నైపుణ్యం ఎక్కడి నుంచి అయినా వచ్చి అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే భారత్‌లోని ఓ చిన్న పట్టణం నుంచి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఓ కుర్రాడిని కనుగొన్నది" అని ఆమె పేర్కొన్నారు.
బుమ్రా తల్లి దల్జీత్ మాట్లాడుతూ
ఆ వీడియోలో బుమ్రా తల్లి దల్జీత్ మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు తన భర్తని కోల్పోయానని చెప్పారు. చిన్నప్పుడు బుమ్రా తనను బంతి కావాలని అడిగేవాడని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో బుమ్రా కలగజేసుకుని తన చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.

నాకు ఒక జత బూట్లు, ఒక జత టీ షర్టులు ఉండేవి
"అప్పుడు మేం ఏదీ కొనలేకపోయాం. నాకు ఒక జత బూట్లు, ఒక జత టీ షర్టులు ఉండేవి. రోజూ వాటినే ఉతికి వేసుకునేవాడిని. అయితే చిన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని గుర్తించి ఇలా అవకాశమిస్తారనే కథలు విని ఉంటాం కదా, అది నిజంగా జరిగింది" అని ఐపీఎల్‌లో తన ప్రవేశం గురించి బుమ్రా తెలిపాడు.

తొలిసారి టీవీలో చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యా
అంతేకాదు ఐపీఎల్‌లో తన కుమారుడిని తొలిసారి టీవీలో చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యానని దల్జీత్ ఆ వీడియోలో గుర్తు చేసుకున్నారు. తాను ఆర్థికంగా, శారీరకంగా ఎంత కుంగిపోయానో బుమ్రా కళ్లారా చూశాడని ఆమె చెప్పారు. అలాంటి పరిస్థితులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని బుమ్రా అందులో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications