న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాసాకు ఆర్సీబీ రిక్వెస్ట్.. డివిలియర్స్‌, కోహ్లీ సిక్సర్లను కూడా కనిపెట్టండి!!

IPL Fans Troll RCB For Asking NASA To Help Find Balls Hit By Kohli & ABD || Oneindia Telugu
Could NASA Also Help Us: RCB Quips As Lander Vikrams Debris Found

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రయోగం చంద్రయాన్-2. ఈ ప్రయోగంలో భారత శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి కుప్పకూలింది. అనంతరం విక్రమ్ ఆచూకీ లభించలేదు. విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా గుర్తించింది. నాసాకు ధన్యవాదాలు తెలిపిన ఐపీఎల్‌ ప్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. పనిలోపనిగా ఓ రిక్వెస్ట్‌ చేసింది.

ఆసీస్ బౌలర్లు ఎక్కడైనా రాణించగలరు.. టీమిండియా కన్నా మా బౌలింగే అత్యుత్తమం!!ఆసీస్ బౌలర్లు ఎక్కడైనా రాణించగలరు.. టీమిండియా కన్నా మా బౌలింగే అత్యుత్తమం!!

మాకు సాయం చేయండి:

మాకు సాయం చేయండి:

'నాసా టీమ్‌ విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని కనిపెట్టిందా. మాకు కూడా మీ అవసరం ఉంది. డివిలియర్స్‌, కోహ్లీలు కొట్టే సిక్సర్లను కూడా కనిపెట్టడానికి సాయం చేయండి' అంటూ ఆర్సీబీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కెమెంట్లు పెడుతున్నారు. 'డివిలియర్స్‌, కోహ్లీలు మాత్రమే సిక్సర్లు కొడతారా?' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'సిక్సర్ల సంగతి తరువాత కానీ.. ఇక కప్ సాధించారా?' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

ఒక్క టైటిల్‌ లేదు:

ఒక్క టైటిల్‌ లేదు:

ఐపీఎల్ మొదలయి సుమారు 12 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకూ ఆర్సీబీ ఒక్క ఐపీఎల్‌ టైటిల్‌ కూడా సాధించలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, కెవిన్ పీటర్సన్, రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఆర్సీబీకి టైటిల్‌ను సాధించిపెట్టలేదు. అయితే కోహ్లీ, డివిలియర్స్‌లపైనే పూర్తిగా ఆధారపడం జట్టుకు దెబ్బపడుతోంది.

అభిమానుల నిరాశ:

అభిమానుల నిరాశ:

భారత్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ఇన్నాళ్లు ట్రోఫీ గెలకపోవడం సగటు క్రికెట్ ప్రేమికుడిని నిరాశకు గురి చేస్తుంది. ప్రతీ ఏడాది ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరుగుతున్నా.. ఆర్సీబీ‌పై మాత్రం నమ్మకాన్ని వదల్లేదు. అయితే ఈసారి కచ్చితంగా టైటిల్‌ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈనెల 19వ తేదీన ఐపీఎల్‌ వేలం జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే లీగ్‌ హడావుడి మొదలయింది.

 కీలక ఆటగాళ్లను మాత్రమే:

కీలక ఆటగాళ్లను మాత్రమే:

వచ్చే ఐపీఎల్‌ వేలంలో ఆర్సీబీ ఆచితూచి అడుగులేస్తోంది. కీలక ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. కోహ్లీ, డివిలియర్స్‌, పార్థివ్, చహల్, సైనీ, ఉమేష్, దూబే, సుందర్ లాంటి ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. 2019లో విఫలమయిన గ్రాండ్‌హోమ్, క్లాసేన్, హెట్మియర్, సౌతీ, స్టయినిస్ లాంటి స్టార్ ఆటగాళ్లను వదులుకుంది.

 Retained Players:

Retained Players:

Virat Kohli, Moeen Ali, Yuzvendra Chahal, Parthiv Patel, Mohammed Siraj, Umesh Yadav, Pawan Negi, Devdutt Padikkal, Gurkeerat Singh Mann, Washington Sundar, Shivam Dube, Navdeep Saini, AB de Villiers.

Released Players:

Released Players:

Marcus Stoinis, Shimron Hetmyer, Akshdeep Nath, Nathan Coulter-Nile, Colin de Grandhomme, Prayas Ray Barman, Tim Southee, Kulwant Khejroliya, Himmat Singh, Heinrich Klaasen, Milind Kumar.

Story first published: Tuesday, December 3, 2019, 16:28 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X