Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానులకు శుభవార్త.. వరల్డ్‌ కప్‌లో తక్కువ ధరకే బీరు

Cost to beer: World Cup organisers to spend Rs 2.25 crore to keep beer prices down for fanss

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. త్వరలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌లో అభిమానులు తక్కువ ధరకే బీరును పొందవచ్చు. అయితే ఇంగ్లండ్‌లో బీరు ధర ఎక్కువగా ఉన్నా.. సబ్సిడీపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తక్కువ ధరకే మైదానంలోకి వచ్చే అభిమానులకు అందించేందుకు సిద్ధమైంది.

బీర్‌ స్పాన్సర్‌గా 'బీరా 91':
వరల్డ్‌ కప్‌లో భారత్‌కు చెందిన 'బీరా 91' కంపెనీతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. అధికారిక బీర్‌ స్పాన్సర్‌గా ఉన్న ఈ కంపెనీ బీర్లను మ్యాచ్‌లు జరిగే 11 వేదికల్లో అమ్మాలి. ఐసీసీ ఒక బీరు పింట్‌ (గ్లాసు) ధరను 9.70 డాలర్లు (సుమారు రూ. 670)గా నిర్ణయించారు. ఈ ధర తమకు గిట్టుబాటు కాదని.. కనీసం 15.5 డాలర్లు (సుమారు రూ.1000) ఉంచాలని అక్కడి వ్యాపారులు పట్టుబట్టారు.

ఐసీసీ ఒప్పందం:
నాలుగేళ్లకు ఓ సారి వచ్చే మెగా టోర్నీని చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభిమానులను సంతోచపరచడానికి తక్కువ రేటుకే బీరు అందించడానికి ఐసీసీ సిద్ధమైంది. 'అభిమానులకు తక్కువ ధరకే బీరు ఇవ్వండి.. మిగిలిన నష్టాన్ని మేం ఇస్తాం' అని వ్యాపారులతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 5 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 52 లక్షలు) సబ్సిడీ భారం పడనుంది. అయితే ఈ సబ్సిడీ భారంను ఐసీసీ, ఇంగ్లండ్‌ బోర్డు సమంగా భరిస్తాయి.

Story first published: Wednesday, April 10, 2019, 10:55 [IST]
Other articles published on Apr 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+